Tag Archives: Suniel Shetty

Suniel Shetty: వామ్మో…ఈ హీరో సంపాదన మామూలుగా లేదు… ఏడాదికి వంద కోట్లు సంపాదిస్తున్న హీరో?

Suniel Shetty: బాలీవుడ్ ఇండస్ట్రీలో సునీల్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సునీల్ శెట్టి ఆగస్టు 11, 1961లో మంగళూరు సమీపంలోని ముల్కిలో జన్మించాడు. అయితే ఈయన ‘బల్వాన్’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈ విధంగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సునీల్ శెట్టి కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు.

Suniel Shetty: వామ్మో…ఈ హీరో సంపాదన మామూలుగా లేదు… ఏడాదికి వంద కోట్లు సంపాదిస్తున్న హీరో?

ఈయనకు ముంబైలో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. 30 సంవత్సరాల తన సినీ కెరియర్లో ఈయన ముంబైలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.ఈ వ్యాపారాలతో ఈయన ఏడాదికి ఏకంగా 100 కోట్లకు పైగా సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఈయన ముంబైలో ఎంతో విలాసవంతమైన రెస్టారెంట్లతో పాటు తన భార్యతో కలిసి ఫర్నిచర్ బిజినెస్ స్థాపించారు. ఈ వ్యాపారం ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు.

Suniel Shetty: వామ్మో…ఈ హీరో సంపాదన మామూలుగా లేదు… ఏడాదికి వంద కోట్లు సంపాదిస్తున్న హీరో?

ఇకపోతే 2013లో నటుడు సునీల్ శెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. సునీల్ రియల్టీ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఈ వ్యాపారంతో ఈయన ఏడాదికి 100 కోట్ల రూపాయలు సంపాదించారు.కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్న సునీల్ శెట్టి ఇతర వ్యాపారాలతో పెద్ద ఎత్తున డబ్బును సంపాదిస్తున్నారు.

సునీల్ శెట్టి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినఅతియా శెట్టి…

ఈ విధంగా ఒక వైపు సినిమాలలోను మరోవైపు వ్యాపార రంగాలలో ఎంతో విజయం అందుకున్న సునీల్ శెట్టి సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే తన చిన్ననాటి స్నేహితురాలు మనాను వివాహం చేసుకున్నారు. వీరికికూతురు అతియా శెట్టి, కుమారుడు అహన్ శెట్టి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈయన కుమార్తె అతియా శెట్టి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.