Suniel Shetty: వామ్మో...ఈ హీరో సంపాదన మామూలుగా లేదు... ఏడాదికి వంద కోట్లు సంపాదిస్తున్న హీరో?
Suniel Shetty: బాలీవుడ్ ఇండస్ట్రీలో సునీల్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సునీల్ శెట్టి ఆగస్టు 11, 1961లో మంగళూరు సమీపంలోని ముల్కిలో జన్మించాడు. అయితే ఈయన ‘బల్వాన్’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈ విధంగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సునీల్ శెట్టి కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు.
ఈయనకు ముంబైలో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. 30 సంవత్సరాల తన సినీ కెరియర్లో ఈయన ముంబైలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.ఈ వ్యాపారాలతో ఈయన ఏడాదికి ఏకంగా 100 కోట్లకు పైగా సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఈయన ముంబైలో ఎంతో విలాసవంతమైన రెస్టారెంట్లతో పాటు తన భార్యతో కలిసి ఫర్నిచర్ బిజినెస్ స్థాపించారు. ఈ వ్యాపారం ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు.
ఇకపోతే 2013లో నటుడు సునీల్ శెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. సునీల్ రియల్టీ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఈ వ్యాపారంతో ఈయన ఏడాదికి 100 కోట్ల రూపాయలు సంపాదించారు.కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్న సునీల్ శెట్టి ఇతర వ్యాపారాలతో పెద్ద ఎత్తున డబ్బును సంపాదిస్తున్నారు.
ఈ విధంగా ఒక వైపు సినిమాలలోను మరోవైపు వ్యాపార రంగాలలో ఎంతో విజయం అందుకున్న సునీల్ శెట్టి సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే తన చిన్ననాటి స్నేహితురాలు మనాను వివాహం చేసుకున్నారు. వీరికికూతురు అతియా శెట్టి, కుమారుడు అహన్ శెట్టి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈయన కుమార్తె అతియా శెట్టి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…