Naresh & Pavithra Lokesh : రమ్య, నరేష్, పవిత్ర లోకేష్ ల ఉదంతం రోజుకో మలుపుతో సినిమాను తలపిస్తోంది. ఎవరికి ఎవరితో ఏం రిలేషన్స్ ఉన్నాయో, ఎవరి వైపు న్యాయం ఉందొ కూడా చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఎవరికి వారు మాకు సపోర్ట్ చేయండి అంటూ మీడియా ముందు ఊదరగొడుతున్నారు. ఇక యూట్యూబ్ మొదలుకుని అన్ని సామాజిక మధ్యమాల్లోను వీళ్ళ ఇష్యూ నే కనబడుతోంది. కొంతమంది ప్రముఖులు వీరి ఇష్యూ పై సమీక్ష చేస్తున్నారు.
నరేష్, పవిత్ర లోకేష్ ను వాడుకుంటున్నాడు…
ఇక సామజిక వేత్త కృష్ణ కుమారి నరేష్ ఇష్యూ మీద స్పందించారు. ఆసక్తికర విషయాలను చెప్పారు. నరేష్ కి అతని మూడో భార్యకు చాలా రోజులనుండి పడటం లేదు, విడాకులకు అప్లై కూడా చేసారు. అయితే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ఇప్పుడు పవిత్ర వీరి మధ్యకు రావడంతో అసలు కథ మొదలైంది. ఆమెతో మీడియా ముందు మేము కలిసి ఉన్నాం, కృష్ణ గారి కుటుంబం మద్దతు కూడా ఉంది అంటూ చెప్పించి. సహజీవనం చేస్తున్నాం, నరేష్, రమ్యకు విడాకులు అయ్యాక పెళ్లి చేసుకుంటాం అనేలాగా ఆమె చేత నరేష్ మాట్లాడించారు. రమ్య తన దగ్గరకి బిచ్చం తీసుకుని విడాకులు తీసుకుని పోవాలన్నది నరేష్ ప్లాన్ ఇందు కోసమే పెద్ద రచ్చ చేసి పవిత్ర లోకేష్ ను అడ్డం పెట్టుకుని నరేష్ జారుకుంటున్నాడు. రమ్య తో విడాకులు తీసుకోవాలని భావిస్తున్నాడు అని కృష్ణ కుమారి గారు మరో కోణాన్ని చెప్తున్నారు. ఇక రమ్య కూడా ఇరికించడానికి నరేష్ ఇపుడు దొరికాడు అన్నట్టుగా కన్నడ మీడియా ముందు రచ్చ చేసింది.
కానీ ఆమె మైసూర్ లో ఇద్దరూ ఒకే గదిలో దొరికినపుడు పవిత్ర ను చెప్పుతో కొట్టడానికి వెళ్లడం తప్పు. నరేష్ తో విడాకులు అవ్వలేదు కాబట్టి ఇంకా నరేష్ నీ భర్త అతనితో గొడవ పెట్టుకోవాలి కానీ పవిత్ర ను మధ్యలోకి లాగడం ఎందుకు, సుప్రీం కోర్ట్ ఆదేశానుసారం సహజీవనం, వివాహేతర సంబంధాలు తప్పు కాదు. అయితే వివాహేతార సంబంధం వల్ల భాగస్వామి మానసిక క్షోభకు గురైతే అది గృహ హింస కిందకు వస్తుంది అంటూ వివరించారు. విడాకులకు రమ్య కూడా సుముఖమే అయితే భరణం విషయంలో ఇంకా తేలాల్సి ఉందని అది క్లియర్ అయితే విడాకులు తీసుకుంటానని రమ్య నే మీడియా తో చెప్పిందంటూ కృష్ణ కుమారి గారు గుర్తుచేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…