Tag Archives: supporting role

Actress Hema: వామ్మో.. వందల కోట్ల ఆస్తి సంపాదించిన నటి హేమ.. ఇంకా సంపాదిస్తా అంటూ?

Actress Hema: హేమ.. ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయింది. దాదాపుగా తెలుగు సినిమాల్లో ఆమె లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, వదినగా, అత్తగా, అక్కగా ఇలా రకరకాల పాత్రల్లో సినిమాల్లో నటిస్తోంది.

Actress Hema: వామ్మో.. వందల కోట్ల ఆస్తి సంపాదించిన నటి హేమ.. ఇంకా సంపాదిస్తా అంటూ?

దాదాపుగా దశాబ్ధాలుగా సినిమాల్లో నటిస్తోంది. లాంగ్ స్టాండింగ్ గా ఇండస్ట్రీలో నిలుస్తోంది. ముఖ్యంగా బ్రహ్మానందానికి జోడీగా చేసిన క్యారెక్టర్లు హేమ కెరీర్ లోని ది బెస్ట్ అని చెప్పవచ్చు. అతడు సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ ఎవరూ మరిచపోరు.

Actress Hema: వామ్మో.. వందల కోట్ల ఆస్తి సంపాదించిన నటి హేమ.. ఇంకా సంపాదిస్తా అంటూ?

అయితే ఆమె వందల కోట్ల ఆస్తులు సంపాదించిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల హేమకు వందల కోట్లు ఉన్నాయంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చింది హేమ.

ఇప్పటికీ డబ్బు సంపాదిస్తూనే ..


కెరీర్ మొదట్లో వేల రూపాయల్లో రెమ్యునరేషన్ తీసుకునే దాన్నని.. ఇప్పుడు సినిమాకు లక్ష రూపాయలు తీసుకుంటున్నానని వెల్లడించింది. అయితే అందరూ అనుకున్నంతగా తనకు వందల కోట్ల ఆస్తులేమీ లేవని ఆమె అన్నారు. అయితే కొంతలోకొంత మంచిగానే ఆస్తులు కూడ బెట్టినట్లు వెల్లడించింది. తన కూతురును సెటిల్ చేసేంతగా సంపాదించానని .. ఇప్పటికీ డబ్బు సంపాదిస్తూనే ఉన్నానని వెల్లడించింది.
హేమ ఇటీవల మా ఎలక్షన్లలో కూడా పోటీ చేసింది. అయితే ఆ సమయంలో హేమ ప్రవర్తన కాస్త కాంట్రవర్సీకి కూడా దారి తీసింది. తన సహనటుడు శివబాలాజీని కోరికిందనే ఆరోపణలు వచ్చాయి.

Actress Sudha: నాగార్జున నామీద సెటైర్లు వేసేవాడు.. ‘నా మొహం పనిమనిషి కూడా పనికి రాదన్నారు..’ నటి సుధ షాకింగ్ కామెంట్స్!

Actress Sudha: ఎన్నో తెలుగు సినిమాలలో తల్లిగా, వదినగా, పిన్నిగా అన్ని పాత్రలలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సుధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కెరియర్ మొదట్లో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు.కానీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.

నా మొహం పనిమనిషి పాత్రకి కూడా పనికి రాదని ఆ డైరెక్టర్ కామెంట్ చేశారు.. నటి సుధ షాకింగ్ కామెంట్స్!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నో మంచి సినిమాలో నటించిన మీకు నంది అవార్డు రాకపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురవగా అందుకు ఆమె సమాధానం చెబుతూ పదిమంది కూర్చొని ఇచ్చే అవార్డు గొప్పది కాదు… లక్షల మంది నా నటనను చూసి చప్పట్లు కొట్టి నన్ను అభినందించడమే అసలైన బహుమతి అంటూ చెప్పుకొచ్చారు.

నా మొహం పనిమనిషి పాత్రకి కూడా పనికి రాదని ఆ డైరెక్టర్ కామెంట్ చేశారు.. నటి సుధ షాకింగ్ కామెంట్స్!

అలా నేను నటించిన ప్రతి సినిమా కూడా ఒక అవార్డును అందుకునే పాత్రలలో నటించాను. ఆమె సినిమా అయితే నేమి, నువ్వు నాకు నచ్చావ్, పోకిరి, దూకుడు,మన్మధుడు వంటి ప్రతి ఒక్క సినిమా కూడా ఎంతో అద్భుతమైన సినిమా అని తెలిపారు.ఇక మన్మధుడు సినిమా గురించి చెప్పాలంటే మొదటి హాఫ్ మొత్తం నాగార్జున నా పైన సెటైర్లు వేస్తూ ఉండే పాత్రలో నటించారు మిగిలిన సగం తనకు నిజం చెప్పలేక మదనపడుతూ నటించాల్సిన పాత్ర నాది అంటూ చెప్పారు.

నాలుగు ఇండ్లు కట్టించుకోవాల్సి వచ్చేది…

ఇలా నేను నటించిన ప్రతి సినిమా కూడా అవార్డు అందుకొనే సినిమా.. అలా అవార్డులు కనుక వచ్చి ఉంటే అవార్డుల కోసం నేను నాలుగు ఇండ్లు కట్టించుకోవాల్సి వచ్చేదని తెలిపారు. ఇక డైరెక్టర్ బాలచంద్ర గురించి మాట్లాడుతూ ఆయన ఎంతో గొప్ప డైరెక్టర్ అని అతను ఒక ఆర్టిస్ట్ ని చూడగానే ఇండస్ట్రీలో ఎంతవరకు ఉండగలరని చెప్పగలరని తెలిపారు.కెరియర్ మొదట్లో నేను చెప్పిన ఈ మూడు పాత్రలు చేయగలిగితే నువ్వు చచ్చేవరకు ఇండస్ట్రీలో ఉంటావు. లేదంటే ఇప్పుడే వెళ్ళిపో అని చెప్పారు. ఆయన ఒక మనిషిని చూసి ఎలా చేయగలరో ఇట్టే చెప్పేస్తారు కనుక నీ మొహం గ్లామర్ పని మనిషి కూడా పనికి రాదని అన్నారు అంటూ సుధ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Actress Hema: లావణ్యని పూరి జగన్నాథ్ లేపుకొచ్చాడు.. నేను మా ఆయనే పెళ్లి చేశాం.. నటి హేమ సంచలన వ్యాఖ్యలు

Actress Hema: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఎన్నో సినిమాలలో పిన్ని, వదిన, అక్క పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందిన ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ తన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు. ఇండస్ట్రీలో తాను ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు అనే విషయాల గురించి తెలిపారు. ఇక ఇండస్ట్రీలో తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్నయ్య లాంటి వాడని హేమ పూరి జగన్నాథ్ గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

లావణ్యను లేపుకొచ్చిన పూరి జగన్నాథ్ ..నేను మా ఆయన పెళ్లి చేశాం: నటి హేమ

ఇండస్ట్రీలో తాను కెమెరా మెన్ జాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని,పెళ్లి తర్వాత మేము ఒక చిన్న ఇంటిని కొనుక్కొని అక్కడ నివసిస్తున్నప్పుడు పూరి జగన్నాథ్ కూడా మా ఇంటి కింద అద్దెకు ఉండే వారని తెలిపారు. ఈ సమయంలోనే పూరి జగన్నాథ్ దగ్గరికి తేజ, కృష్ణవంశీ, ఎంతో మంది డైరెక్టర్లు రావడంతో అందరితో మంచి పరిచయం ఉందని తెలిపారు.

కాళ్లు కడిగి కన్యాదానం చేశారు…

ఇక పూరి జగన్నాథ్ లావణ్య అనే అమ్మాయిని ప్రేమించారని వీరి పెళ్లికి ఇంట్లో అభ్యంతరం చెప్పడంతో ఏకంగా పూరి జగన్నాథ్ లావణ్యని లేపుకొచ్చినట్లు నటి హేమ తెలిపారు. ఇలా లావణ్యను తీసుకు వచ్చిన తర్వాత దగ్గరుండి మేమే తనకు పెళ్లి చేశామని, నేను మా ఆయన పూరి జగన్నాథ్ అన్నయ్య పెళ్లికి పెళ్లి పెద్దలమని తెలిపారు. ఇక జాన్ తనకు తండ్రి స్థానంలో ఉండి కాళ్లు కడిగి కన్యాదానం చేశారని హేమ తెలిపారు. అందుకే ఇప్పటికీ లావణ్య తన భర్తను డాడీ అంటూ పిలుస్తుందని పూరిజగన్నాథ్ భార్య గురించి ఆసక్తికరమైన విషయాలను హేమ ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

Best Supporting Actors: ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ వీళ్లే!

Best Supporting Actors: ఒక సినిమా విజయవంతంగా ముందుకు సాగాలంటే.. అందులో కథతో పాటు.. నటించే వాళ్ల ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఒకరికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తే.. మరొకరికి తక్కువ ప్రాదాన్యత ఉంటుంది. అయితే సెంటిమెంట్, ఫైట్స్ , పాటలు, ఎడిటింగ్ ఇలా అన్నీ బాగా కుదిరితే.. ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే ఇక్కడ కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా చేసిన వాళ్లు ఆ సినిమాకే పెద్ద హైలెట్ గా నిలిచారు. వాళ్లు ఎవరు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం.. అందులో ముఖ్యంగా..

బండారి జగదీష్.. ఇతడు పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ చేశాడు. సినిమా బిగినింగ్ నుంచి చివరి వరకు కూడా.. అతడు హీరోతోనే ఉంటూ.. కామెడీ పంచ్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడికి ఈ సినిమాలో మంచి గుర్తింపు వచ్చింది. అంతకు ముందు ఇతడు పలాస సినిమాలో నటించాడు.

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈమె ఈ సంవత్సరం విడుదలైన క్రాక్ చిత్రంలో నటించింది. ఆ క్యారెక్టర్ కు ఆమె తప్ప ఎవరూ సూట్ కారన్న రేంజిలో నటించింది. ఇప్పుడు సమంత ‘యశోద’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.

ప్రకాష్ రాజ్.. ఈ పేరు తెలియని వారుండరేమో. అంతాలా అతడు నటనకు ప్రాణం పోసి జీవిస్తాడు. ఈ సంవత్సరంలో వచ్చిన వకీల్ సాబ్ లో అతడు లాయర్ పాత్ర పోషించాడు. లాయర్ నందాగ మరోసారి అద్భుతంగా నటించాడు.

కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లు సినిమాలో కాజల్ ఓ కీలక పాత్ర పోషించింది. అను పాత్రకు ప్రాణం పోసింది. సినిమా ఫ్లాప్ అయినా కాజల్ ది బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ గా నిలిచింది.

రాజీవ్ కనకాల.. వెంకటేష్ OTT చిత్రం నారప్పలో రాజీవ్ కనకాల సూపర్ సపోర్టింగ్ రోల్ పోషించారు. చాలా రోజుల తర్వాత రాజీవ్ ఇంత పెద్ద పాత్రలో నటించారు. నారప్ప బావమరిది బసవయ్య పాత్రకు ప్రాణం పోయడమే కాకుండా.. కథను ముందుకు తీసుకెళ్లే పాత్రలో రాజీవ్ కనకాల కనిపించారు.

కథను మలుపు తిప్పే పాత్రలు అవి..

రమ్యకృష్ణ.. రమ్య కృష్ణ చిత్రం రిపబ్లిక్. దీనిలో ముఖ్యమంత్రి విశాఖ వాణి పాత్ర పోషించింది . ధరమ్ తేజ్ హీరో. దీనిలో ఆమె నటన నీలాంబరిని గుర్తు చేసింది.

జగపతిబాబు.. బాలయ్య అఖండ సినిమాలో జగపతిబాబు అఘోర బాబా పాత్ర కీలకం. కథని మలుపు తిప్పే పాత్ర ఇది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.ఈ సినిమా భారీ విజయం సాధించింది.