Movie News

Actress Hema: లావణ్యని పూరి జగన్నాథ్ లేపుకొచ్చాడు.. నేను మా ఆయనే పెళ్లి చేశాం.. నటి హేమ సంచలన వ్యాఖ్యలు

Actress Hema: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఎన్నో సినిమాలలో పిన్ని, వదిన, అక్క పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందిన ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ తన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు. ఇండస్ట్రీలో తాను ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు అనే విషయాల గురించి తెలిపారు. ఇక ఇండస్ట్రీలో తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్నయ్య లాంటి వాడని హేమ పూరి జగన్నాథ్ గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

లావణ్యను లేపుకొచ్చిన పూరి జగన్నాథ్ ..నేను మా ఆయన పెళ్లి చేశాం: నటి హేమ

ఇండస్ట్రీలో తాను కెమెరా మెన్ జాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని,పెళ్లి తర్వాత మేము ఒక చిన్న ఇంటిని కొనుక్కొని అక్కడ నివసిస్తున్నప్పుడు పూరి జగన్నాథ్ కూడా మా ఇంటి కింద అద్దెకు ఉండే వారని తెలిపారు. ఈ సమయంలోనే పూరి జగన్నాథ్ దగ్గరికి తేజ, కృష్ణవంశీ, ఎంతో మంది డైరెక్టర్లు రావడంతో అందరితో మంచి పరిచయం ఉందని తెలిపారు.

కాళ్లు కడిగి కన్యాదానం చేశారు…

ఇక పూరి జగన్నాథ్ లావణ్య అనే అమ్మాయిని ప్రేమించారని వీరి పెళ్లికి ఇంట్లో అభ్యంతరం చెప్పడంతో ఏకంగా పూరి జగన్నాథ్ లావణ్యని లేపుకొచ్చినట్లు నటి హేమ తెలిపారు. ఇలా లావణ్యను తీసుకు వచ్చిన తర్వాత దగ్గరుండి మేమే తనకు పెళ్లి చేశామని, నేను మా ఆయన పూరి జగన్నాథ్ అన్నయ్య పెళ్లికి పెళ్లి పెద్దలమని తెలిపారు. ఇక జాన్ తనకు తండ్రి స్థానంలో ఉండి కాళ్లు కడిగి కన్యాదానం చేశారని హేమ తెలిపారు. అందుకే ఇప్పటికీ లావణ్య తన భర్తను డాడీ అంటూ పిలుస్తుందని పూరిజగన్నాథ్ భార్య గురించి ఆసక్తికరమైన విషయాలను హేమ ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago