Thottempudi Venu: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు తొట్టెంపూడి వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్వయంవరం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నటుడు వేణు ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.
ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వేణు ప్రస్తుతం ఇండస్ట్రీ దూరమయ్యారు.అయితే ఈ విధంగా వేణు ఇండస్ట్రీకి దూరం అవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనంత ప్రభు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వేణు గురించి మాట్లాడుతూ.. స్వయంవరం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సమయంలో ఆయనకు క్రమంగా ఆఫర్లు తగ్గిపోయాయి.
కెరీర్లు ఇంజనీర్ కావాలనుకున్న వేణు సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇలా ఇండస్ట్రీలోకి వచ్చారని అయితే ప్రస్తుతం తనకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో తన భార్యతో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. 2001లో అనుపమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఈమె మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేయడంతో ప్రస్తుతం తనతో కలిసి బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. రామాచారి అనే సినిమాలో వేణు చివరిసారిగా హీరోగా నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ బావ గా కనిపించారు. ఇలా ఇండస్ట్రీలోఅన్ని రకాల పాత్రల్లో నటించడం పోవడమే అతనికి మైనస్ అయిందని దీని వల్ల తనకు ఆఫర్లు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యారని అనంత ప్రభు తెలిపారు. అయితే తనకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు పాత్రలు దొరికితే తప్పకుండా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…