Hero Venkat: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటిస్తూ,హీరోగా పలు చిత్రాల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడు పాత్రలో నటించారు.ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఆ తర్వాత జగపతిబాబు హీరోగా నటించిన శివరామరాజు చిత్రంలో ఆయన తమ్ముడుగా కూడా నటించారు.
ఈ విధంగా పలు విజయవంతమైన చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు వెంకట్ ఉన్నపళంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గి పోలేదని ఏదో ఒక పాత్రలో నటించే అవకాశాలు వస్తున్నట్లు ఆయన తెలిపారు. కానీ ఇండస్ట్రీకి ఇన్ని రోజులు దూరం అవడానికి గల కారణాలను కూడా తెలిపారు. ఆ నలుగురు సినిమా నిర్మించిన నిర్మాత తర్వాత ఆ అయిదుగురు చిత్రాన్ని నిర్మించారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను.
ఈ సినిమా షూటింగ్ సమయంలో చిన్న ప్రమాదం జరగడం వల్ల పైనుంచి కిందికి పడిపోయాను. ఈ క్రమంలోనే వెన్నెముక గాయం కావడం వల్ల పూర్తిగా విశ్రాంతి తీసుకున్నానని అందుకే ఇండస్ట్రీలో ఈ గ్యాప్ ఏర్పడిందని ఆయన తెలిపారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ బిజినెస్ చేస్తూ ఉండేవాడిని అయితే ఇప్పుడిప్పుడే తనకు మంచి అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చినట్టు నటుడు వెంకట్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…