Tag Archives: Surekha Vani Second Marriage

“మనసున్న వాడు కాదు.. డబ్బున్న వాడు కావాలి”.. రెండో పెళ్లిపై సురేఖా వాణి షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్లో అగ్ర హీరోలకు సంబంధించిన ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ.. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రముఖ నటి సురేఖా వాణి. కేవలం సినిమాల్లో కనిపించడమే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఇటీవల సురేఖా… తన స్నేహితురాలు రజితతో కలిసి ప్రముఖ టాల్క్ షోలో పాల్గోంది.

అందులో తన రెండో పెళ్ళికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు సురేఖా.ఇక బిగ్ స్క్రీన్ పై ఎప్పుడూ సంప్రదాయంగా కనిపించే సురేఖా.. సోషల్ మీడియాలో మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలతోపాటు.. మోడ్రన్ లుక్కులో ఉండే ఫోటోలను షేర్ చేస్తూ..ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇటీవల సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న సందర్భంగా సురేఖా కూడా రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇక ఈ వార్తలపై గతంలోనే సురేఖా క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ టాల్క్ షోలో పాల్గోన్న ఆమె మరోసారి ఈ విషయాలపై స్పందించింది. తన కెరీర్‌ ప్రారంభమై 22 ఏళ్లు పైగా అవుతుందని పేర్కొన్న ఆమె సీటీ కేబుల్‌లో కెరీర్‌ స్టార్ట్ అయ్యిందని అక్కడ తన బాబాయ్ పని చేస్తూ ఉండడంతో ఆయన ప్రోద్బలంతో ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలు చేస్తూ ఇక్కడి దాకా వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది.

అలాగే తన రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వార్తలు వచ్చేవరకు తనకు తెలియదని తాను ఎవరిని పెళ్ళి చేసుకుంటున్న అనే విషయం.. ఆయన ఎవరో తెలిస్తే చెప్పాలని కోరింది. ఒకవేళ సంబంధం చూస్తే.. కాస్తా డబ్బున్న వాళ్ళను చూడాలని తెలిపింది. దీంతో మనసున్న వాళ్ళు కావాలా? డబ్బున్న వాళ్ళు కావాలా? అని యాంకర్ అడగ్గా.. మనసుతో పనులు జరగవని అర్థమైపోయిందని, డబ్బున్న వాళ్ళయితే బెటర్ అని అంటోంది సురేఖా వాణి…!!