Tag Archives: this month

తెలంగాణ సర్కార్ వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఈ నెల నుంచే అమలు..

వారికి తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. జ‌ల‌మండ‌లి బోర్డులో ప‌ని చేస్తున్న‌ ఉద్యోగులు అంద‌రికీ పీఆర్సీ అమ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింది. ఈ నెల నుంచే జ‌ల‌మండ‌లి ఉద్యోగులకు పీఆర్సీ అమ‌లు కానుంది.

న‌వంబ‌రు నుంచే పెంచిన వేత‌నాల‌ను చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. తమకు పీఆర్సీ అమలు చేయాలని ఎప్పటి నుంచే జలమండలి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ డిమాండ్ పై నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఖైరతాబాద్ జలమండలి ఎదుట ఎన్నో సార్లు ఇలా నిరసన చేపట్టారు.

గత నెలలో వాళ్లు .. అన్ని శాఖల వారికి పీఆర్సీ ఇస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వరంటూ డిమాండ్ చేశారు. దాదాపు బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులంతా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి ఆ బోర్డులో ప‌ని చేస్తున్న‌ ఉద్యోగులు అంద‌రికీ పీఆర్సీ ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంతో జలమండలిలో పనిచేస్తున్న దాదాపు 4 వేల మంది ఉద్యోగులకు వేతన పెంపు లభించనుంది. ఈ నెల నుంచే ఇది అధికారికంగా అమలు కానుంది. దీంతో జలమండలిలో పని చేస్తున్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దేవుడు అంటూ.. ప్రశంసలతో ముంచెత్తారు.

ఈ నెల 31న నింగిలో అద్భుతం.. ఏం జరగనుందంటే..?

ఆకాశంలో ప్రతి సంవత్సరం కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ అద్భుతాలు ఎక్కువగా అక్టోబర్ నెలలోనే చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ నెల 31వ తేదీన కూడా ఆకాశంలో ఒక అద్భుతం చోటు చేసుకోనుంది. మనకు ఎల్లప్పుడూ తెలుపు రంగులో కనిపించే చందమామ 31వ తేదీన మాత్రం నీలం రంగులో దర్శనమివ్వనున్నాడు. రాత్రివేళ పిల్లల నుంచి పెద్దల వరకు ఆహ్లాదాన్ని పంచే చందమామ 31న ఎక్కువ కాంతితో, పెద్ద పరిమాణంలో కనిపించనున్నాడు.

ఈ నెల 1వ తేదీన కూడా బ్లూ మూన్ దర్శనం ఇచ్చినప్పటికీ 31వ తేదీన కనిపించబోయే చందమామ దానికంటే ఎక్కువ పరిమాణంతో కనిపించనుండటంతో ఈ బ్లూ మూన్ ప్రాముఖ్యతను సంతరించకుంది. 1944 సంవత్సరంలో పెద్ద పరిమాణంలో చంద్రుడు కనిపించగా దాదాపు 76 సంవత్సరాల తర్వాత అదే అద్భుతం చోటు చేసుకోనుంది. మళ్లీ ఇలాంటి బ్లూ మూన్ ను చూడాలంటే 19 సంవత్సరాలు ఎదురుచూపులు తప్పవు.

76 ఏళ్ల తరువాత బ్లూమూన్ కనిపించబోతుండటంతో ప్రపంచ దేశాల ప్రజలు బ్లూ మూన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ బ్లూ మూన్ పూర్తి నీలి రంగులో కనిపించదు. ఇప్పుడు బ్లూ మూన్ ను చూడటం మిస్ ఐతే మళ్లీ 2039 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు బ్లూ మూన్ కనిపించనున్న నేపథ్యంలో నాసా ఒక కీలక ప్రకటన చేస్తామని తెలిపింది. అయితే నాసా దేని గురించి ప్రకటన చేయనుందనే విషయాలు తెలియాల్సి ఉండి.

నాసా చందమామ గురించి గతంలో ఎవరికీ తెలియని ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందని ఆ విషయాన్ని వెల్లడించనుందని అనధికారికంగా తెలుస్తోంది. ప్రపంచం యావత్తూ ఈ అద్భుతం గురించి వేచి చూస్తూ ఉండటంతో బ్లూ మూన్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.