వారికి తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. జలమండలి బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ పీఆర్సీ అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ నెల నుంచే జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు కానుంది.
నవంబరు నుంచే పెంచిన వేతనాలను చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. తమకు పీఆర్సీ అమలు చేయాలని ఎప్పటి నుంచే జలమండలి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ డిమాండ్ పై నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఖైరతాబాద్ జలమండలి ఎదుట ఎన్నో సార్లు ఇలా నిరసన చేపట్టారు.
గత నెలలో వాళ్లు .. అన్ని శాఖల వారికి పీఆర్సీ ఇస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వరంటూ డిమాండ్ చేశారు. దాదాపు బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులంతా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి ఆ బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ పీఆర్సీ ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంతో జలమండలిలో పనిచేస్తున్న దాదాపు 4 వేల మంది ఉద్యోగులకు వేతన పెంపు లభించనుంది. ఈ నెల నుంచే ఇది అధికారికంగా అమలు కానుంది. దీంతో జలమండలిలో పని చేస్తున్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దేవుడు అంటూ.. ప్రశంసలతో ముంచెత్తారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…