తెలంగాణ సర్కార్ వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఈ నెల నుంచే అమలు..

0
174

వారికి తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. జ‌ల‌మండ‌లి బోర్డులో ప‌ని చేస్తున్న‌ ఉద్యోగులు అంద‌రికీ పీఆర్సీ అమ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింది. ఈ నెల నుంచే జ‌ల‌మండ‌లి ఉద్యోగులకు పీఆర్సీ అమ‌లు కానుంది.

న‌వంబ‌రు నుంచే పెంచిన వేత‌నాల‌ను చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. తమకు పీఆర్సీ అమలు చేయాలని ఎప్పటి నుంచే జలమండలి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ డిమాండ్ పై నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఖైరతాబాద్ జలమండలి ఎదుట ఎన్నో సార్లు ఇలా నిరసన చేపట్టారు.

గత నెలలో వాళ్లు .. అన్ని శాఖల వారికి పీఆర్సీ ఇస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వరంటూ డిమాండ్ చేశారు. దాదాపు బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులంతా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి ఆ బోర్డులో ప‌ని చేస్తున్న‌ ఉద్యోగులు అంద‌రికీ పీఆర్సీ ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంతో జలమండలిలో పనిచేస్తున్న దాదాపు 4 వేల మంది ఉద్యోగులకు వేతన పెంపు లభించనుంది. ఈ నెల నుంచే ఇది అధికారికంగా అమలు కానుంది. దీంతో జలమండలిలో పని చేస్తున్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దేవుడు అంటూ.. ప్రశంసలతో ముంచెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here