Tag Archives: ticket rates

Actor Naresh: సినిమా విడుదలైన రెండో రోజే థియేటర్లు ఖాళీ.. నరేష్ కామెంట్స్ వైరల్!

Actor Naresh: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కరోనాకి ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. దేశంలో కరోనా వ్యాప్తి చెందడంతో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా చాలా నష్టపోయింది. కరోనా కారణంగా సినిమా నిర్మాణ పనులు ఆగిపోయి నటీనటులందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు. కరోనా తగ్గు ముఖం పట్టిన తర్వాత కూడా ప్రేక్షకులు బయటకి వచ్చి థియేటర్లలో సినిమాలు చూడటానికి ఇష్టపడటం లేదు.

థియేటర్లు మూతపడటంతో ఓటీటీ లకు బాగా అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపటం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటిటిలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి నెలలు గడుస్తున్నా కూడా చాలామంది ప్రేక్షకులు ఓటీటీ లలోనే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకు ముఖ్య కారణం సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగటమే. బాగా డబ్బున్న వారికి ఈ టికెట్ రేట్లు పెద్ద సమస్య కాదు. కానీ ఒక మధ్య తరగతి కుటుంబం సినిమా చూడాలంటే మినిమం 3 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందువల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం లేదు.

ఇటీవల ఈ విషయంపై నటుడు వి కె నరేష్ స్పందించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రతో ఉన్న రిలేషన్ వల్ల వివాదంలో నిలిచిన నరేష్ చాలాకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాడు. ఇటీవల నరేష్ ఈ విషయం గురించి స్పందిస్తూ ప్రజలు థియేటర్లలో సినిమా చూడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నరేష్ స్పందిస్తూ…సినిమా కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్లకి వచ్చి సినిమాలు చూస్తారు. ఇటీవల విడుదలైన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయని వెల్లడించాడు.

Actor Naresh: పాప్ కార్న్ పెప్సీ రేట్లు పెరగడం కూడా..

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడకపోవటానికి టికెట్ రేట్లు పెరగటం ముఖ్య కారణం కావచ్చు .కానీ అదొక్కటే కారణం కాదు. సినిమా టికెట్ రేట్లతో పాటు సినిమా థియేటర్లలో అమ్ముతున్న పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లు కూడా బాగా పెరిగాయి. ఒకప్పుడు రూ.20, రూ.30 లకు దొరికే పాప్ కార్న్, కూల్ డ్రింక్ ధర ఇప్పుడు రూ.200, రూ.300 అయ్యింది. అందువల్ల ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే! అలాంటప్పుడు ప్రజలు థియేటర్‌కు రావటానికి ఆసక్తి చూపరు. వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటారు. అని నరేశ్‌ ట్వీట్‌ చేశాడు.

Hero Nani: టిక్కెట్ల రేట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. వాళ్లంతా తెలివితక్కువ వాళ్లే!

Hero Nani: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాని మరోసారి టికెట్ రేట్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈయన సినిమా టికెట్ల రేట్లు గురించి మాట్లాడుతూ థియేటర్ కలెక్షన్ కన్నా కిరాణాకొట్టు కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు.

Hero Nani: టిక్కెట్ల రేట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. వాళ్లంతా తెలివితక్కువ వాళ్లే!

ఈ విధంగా నాని సంచలన వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో వైసీపీ మంత్రులు సైతం నాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.అయితే తాను మాట్లాడిన మాటలను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ నాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

Hero Nani: టిక్కెట్ల రేట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. వాళ్లంతా తెలివితక్కువ వాళ్లే!

తాజాగా అంటే సుందరానికి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మరోసారి నాని సినిమా టికెట్లు గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను విమర్శించే వారు అందరూ కూడా తెలివితక్కువ వాళ్లే. 20..40..60 రూపాయ‌ల టికెట్ ధ‌ర‌ల‌తో సినిమా ఇండ‌స్ట్రీ మ‌నుగ‌డ సాధించ‌లేద‌ని అన్నాను. అంతేకానీ తాను సినిమా టికెట్ల రేట్లను 500 రూపాయలు పెంచమని అడగలేదు. అది కూడా తప్పు అయితే ఇది కూడా తప్పే అంటూ ఈయన టికెట్ల రేట్లు గురించి మరోసారి స్పందించారు.

రాజకీయ పరిణామాలకు కారణం అవుతుందా….

ఈ క్రమంలోనే నాని సినిమా టికెట్ల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమా జూన్ 10వ తేదీ విడుదల కావడంతో జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నిర్వహించనున్నారు.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరు కానున్నారని తెలియడంతో మరోసారి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేదికగా రాజకీయ పరిణామాలకు దారితీస్తుందా అంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.