Actor Naresh: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కరోనాకి ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. దేశంలో కరోనా వ్యాప్తి చెందడంతో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా చాలా నష్టపోయింది. కరోనా కారణంగా సినిమా నిర్మాణ పనులు ఆగిపోయి నటీనటులందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు. కరోనా తగ్గు ముఖం పట్టిన తర్వాత కూడా ప్రేక్షకులు బయటకి వచ్చి థియేటర్లలో సినిమాలు చూడటానికి ఇష్టపడటం లేదు.
థియేటర్లు మూతపడటంతో ఓటీటీ లకు బాగా అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపటం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటిటిలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి నెలలు గడుస్తున్నా కూడా చాలామంది ప్రేక్షకులు ఓటీటీ లలోనే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకు ముఖ్య కారణం సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగటమే. బాగా డబ్బున్న వారికి ఈ టికెట్ రేట్లు పెద్ద సమస్య కాదు. కానీ ఒక మధ్య తరగతి కుటుంబం సినిమా చూడాలంటే మినిమం 3 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందువల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం లేదు.
ఇటీవల ఈ విషయంపై నటుడు వి కె నరేష్ స్పందించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రతో ఉన్న రిలేషన్ వల్ల వివాదంలో నిలిచిన నరేష్ చాలాకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాడు. ఇటీవల నరేష్ ఈ విషయం గురించి స్పందిస్తూ ప్రజలు థియేటర్లలో సినిమా చూడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నరేష్ స్పందిస్తూ…సినిమా కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్లకి వచ్చి సినిమాలు చూస్తారు. ఇటీవల విడుదలైన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయని వెల్లడించాడు.
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడకపోవటానికి టికెట్ రేట్లు పెరగటం ముఖ్య కారణం కావచ్చు .కానీ అదొక్కటే కారణం కాదు. సినిమా టికెట్ రేట్లతో పాటు సినిమా థియేటర్లలో అమ్ముతున్న పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లు కూడా బాగా పెరిగాయి. ఒకప్పుడు రూ.20, రూ.30 లకు దొరికే పాప్ కార్న్, కూల్ డ్రింక్ ధర ఇప్పుడు రూ.200, రూ.300 అయ్యింది. అందువల్ల ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే! అలాంటప్పుడు ప్రజలు థియేటర్‌కు రావటానికి ఆసక్తి చూపరు. వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటారు. అని నరేశ్ ట్వీట్ చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…