Tag Archives: title

Mahesh Babu: ఈరోజు ఎంతో ప్రత్యేకం… ఇది మీకోసమే నాన్న.. వైరల్ అవుతున్న మహేష్ ట్వీట్!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ దివంగత నటుడు కృష్ణ గారి 81 వ జయంతి వేడుకలు నేడు జరగనున్నాయి. నేడు కృష్ణ గారి జయంతి కావడంతో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రి జయంతిని పురస్కరించుకొని చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇలా మహేష్ బాబుట్విటర్ వేదికగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను చేయబోతున్న సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్ షేర్ చేశారు. ఇందులో మహేష్ బాబు తలకు ఎరుపు రంగు రిబ్బన్ కట్టుకొని మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోని మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు ఇదంతా మీకోసమే నాన్న అంటూ ట్వీట్ చేశారు.

ఇలా మహేష్ బాబు తన తండ్రిని తలుచుకొని చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్ ఈరోజు సాయంత్రం థియేటర్లో 6:03నిమిషాలకు విడుదల చేయనున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈ సినిమా టైటిల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Mahesh Babu: గుంటూరు కారం…


సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్స్ పెట్టాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ఇక నేడు కృష్ణ గారి జయంతి కావడంతో ఆయన నటించిన మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాని కూడా విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా చేస్తే బిగ్​బాస్​ టైటిల్ కొట్టడం సింపులే..ఐదు సీజన్లు గమనిస్తే అదే అర్థం అవుతుంది..!

బిగ్ బాస్ ఇప్పటి వరకు మొత్తం 5 సీజన్లు పూర్తయ్యాయి. ఇంటిని, కుటుంబాన్ని వదిలి 100 రోజులు ఉండటం అంటే మామూలు విషయం కాదు. చాలామంది ఒక్క నెల రోజులు కూడా తన తల్లిదండ్రులను, తమ ఫ్యామిలీని వదిలి ఉండలేరు.. కానీ ఇన్ని రోజులు ఒక హౌస్ లో ఎలాంటి టీవీలు, మొబైల్స్ లేకుండా ఉండటం అంటే నిజంగా గ్రేటే.

అయితే మొదటి సీజన్లో మాత్రం దాదాపు 70 రోజలు మాత్రమే పెట్టారు. కానీ తర్వాత సీజన్ నుంచి దాదాపు 100 రోజలు కంటే ఎక్కువగానే ఉండే విధంగా చూశారు. ఇలా ఆ హౌజ్ లో ఉన్న వాళ్లతో బాండింగ్ పెంచుకొని.. వాళ్లతోనే కలిసి ఉండాలి. ఒకరిని ఒకరు తెలుసుకొని జర్నీ మొదలు పెడతారు. అందులో ఎన్నో ఎమోషన్స్, కష్టాలు, బాధలతో కూడుకొని.. ఎంతో బరువైన హృదయంతో బయటకు వెళ్తుంటారు. ఇలా ఎలిమినేషన్ అయిన సమయంలో వాళ్లు ఎమోషన్ పీక్ స్టేజ్ కు వెళ్తుంది.

ఇదంతా ఇలా ఉంటే.. బిగ్ బాస్ టైటిల్ గెలుచున్న వారి వ్యవహార శైలిని గమనిస్తే.. బిగ్ బాస్ వీళ్లకే ఎందుకు టైటిల్ ఇస్తున్నాడు అనే అనుమానం కలుగుతుంది. బహుషా.. దీని వెనుకాల కారణం కూడా ఉంది. బిగ్బాస్ ఎక్కువగా ఇలాంటి వారికే ఇస్తుండటం.. ప్రజలు కూడా వాళ్లనే సపోర్టు చేస్తుండటం గమనించవచ్చు.

మొదటి సీజన్ విషయానికి వస్తే.. టైటిల్ విన్నర్ అయిన శివబాలాజీ హౌస్ లో ఎంతో ఎమోషనల్ గా ఉండేవాడు. తర్వాత తనకు తాను తెలుసుకొని అందులో ఉన్న వాళ్లతో మంచిగా మెలిగేవారు. ఇలా టెంపర్ చూపించి.. చివరకు కూల్ పర్సన్ గా పేరు తెచ్చుకొని టైటిల్ ను ఎగురేసుకుపోయాడు.

ఇక రెండో సీజన్ కు వస్తే కౌశల్ కూడా అంతే.. ఎంతో ఎమోషనల్ చూపిస్తూ.. బిగ్ బాస్ పై కూడా ఒకానొక సమయంలో ఆవేశంతో మాట్లాడాడు. చివరకు ఇతడికి టైటిల్ వచ్చేసింది. మూడో సీజన్లో కూడా అంతే రాహుల్ సిప్లిగంజ్ కు ఉన్న టెంపర్ కు ఎప్పుడో ఇంటి నుంచి బయటకు రావాలి. కానీ అతడినే టైటిల్ వరించింది. నాలుగో సీజన్లో మాత్రం టెంపర్ చూపించకున్నా.. ఎంతో కూల్ గా కనిపించిన అభిజిత్ కు టైటిల్ వరించింది. ఒకానొక సమయంలో సోహేల్ గెలుచుకుంటారని అనుకున్నారు. తాజాగా టైటిల్ గెలిచిన సన్నీ కూడా అంతే . ఎంతో ఎమోషనల్ గా ఉంటూ.. తనను తాను మార్చకుంటూ.. ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.

వీటిని అన్నింటిని గమనిస్తే.. సాటి ప్రేక్షకుడికి ఎక్కువగా వచ్చే ఆలోచన ఏంటంటే.. హౌస్ లో టైటిల్ కొట్టాలంటే.. ఎంతో ఎమోషనల్ గా ఉంటూ.. కూల్ అవుతూ.. టెంపర్ చూపిస్తూ.. దానిని కంట్రోల్ చేసుకుంటూ.. నాగార్జునతో ప్రశంసలు పొందుతూ ఉంటే.. టైటిల్ విన్నర్ అవ్వడం ఖాయం అనే అభిప్రాయానికి వస్తున్నారు.

రాజా విక్రమార్క టైటిల్ చెప్పగానే చిరంజీవి అలా అన్నారు: కార్తికేయ

ఆర్ఎక్స్ 100 తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న హీరో కార్తికేయ. అతడు ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ టైటిల్ తో మెగస్టార్ చిరంజీవి నటించిన విషయం తెలిసిందే.

అయితే కార్తికేయ నటిస్తున్న ఈ సినిమాలో ఈ టైటిల్ ను చెప్పింది కూడా కార్తికేయ అంట. ఈ విషయాలను అతడు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఈ కథను శ్రీ సిరిపల్లి చెప్పడంతో తనకు బాగా నచ్చిందని.. ఈ సినిమాను అతడు నిజాయితీగా తీయగలడనే నమ్మకం వచ్చిందన్నారు. కథను చెప్పినట్టే చక్కగా తెరకెక్కించారన్నారు.

ఎన్‌ఐఏ ఏజెంట్‌గా ఈ సినిమాలో కనపడుతానన్నారు. ఓ రోజు శ్రీతో తానే ఈ ‘రాజా విక్రమార్క ’ టైటిల్ బాగుంటుందని చెప్పాను.. అతడు ఓ రోజు టైం తీసుకొని ఫైనల్ చేశారన్నారు. ఈ టైటిల్ పెట్టిన తర్వాత చిరంజీవికి ఫోన్ చేసి చెప్పినట్లు చెప్పాడు. ఆయను ‘గుడ్ లక్’ అని అన్నారన్నారు. చిరంజీవిగారి మీద అభిమానంతో ఆయన సినిమా టైటిల్‌ పెట్టుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు.

తన ఫిజిక్ కారణంగానే ఆర్‌ఎక్స్‌ 100, గ్యాంగ్‌ లీడర్‌, వలిమై చిత్రాల్లో అవకాశాలు ఇచ్చినట్లు ఆయా చిత్ర దర్శకులే చెప్పారన్నారు. అయితే అజిత్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా వలిమై గురించి మాట్లాడారు. అందులో తాను విలన్ గా చేస్తున్నానన్నారు. ఈ సినిమా కారణంగానే తాను తమిళ్ నేర్చుకోవాల్సి వచ్చిందన్నారు. డబ్బింగ్ తానే చెప్పుకున్నట్లు వివరించాడు.