ఆర్ఎక్స్ 100 తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న హీరో కార్తికేయ. అతడు ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ టైటిల్ తో మెగస్టార్ చిరంజీవి నటించిన విషయం తెలిసిందే.
అయితే కార్తికేయ నటిస్తున్న ఈ సినిమాలో ఈ టైటిల్ ను చెప్పింది కూడా కార్తికేయ అంట. ఈ విషయాలను అతడు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఈ కథను శ్రీ సిరిపల్లి చెప్పడంతో తనకు బాగా నచ్చిందని.. ఈ సినిమాను అతడు నిజాయితీగా తీయగలడనే నమ్మకం వచ్చిందన్నారు. కథను చెప్పినట్టే చక్కగా తెరకెక్కించారన్నారు.
ఎన్‌ఐఏ ఏజెంట్‌గా ఈ సినిమాలో కనపడుతానన్నారు. ఓ రోజు శ్రీతో తానే ఈ ‘రాజా విక్రమార్క ’ టైటిల్ బాగుంటుందని చెప్పాను.. అతడు ఓ రోజు టైం తీసుకొని ఫైనల్ చేశారన్నారు. ఈ టైటిల్ పెట్టిన తర్వాత చిరంజీవికి ఫోన్ చేసి చెప్పినట్లు చెప్పాడు. ఆయను ‘గుడ్ లక్’ అని అన్నారన్నారు. చిరంజీవిగారి మీద అభిమానంతో ఆయన సినిమా టైటిల్ పెట్టుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు.
తన ఫిజిక్ కారణంగానే ఆర్‌ఎక్స్ 100, గ్యాంగ్ లీడర్, వలిమై చిత్రాల్లో అవకాశాలు ఇచ్చినట్లు ఆయా చిత్ర దర్శకులే చెప్పారన్నారు. అయితే అజిత్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా వలిమై గురించి మాట్లాడారు. అందులో తాను విలన్ గా చేస్తున్నానన్నారు. ఈ సినిమా కారణంగానే తాను తమిళ్ నేర్చుకోవాల్సి వచ్చిందన్నారు. డబ్బింగ్ తానే చెప్పుకున్నట్లు వివరించాడు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…