రవిబాబు.. ప్రస్తుతం దర్శకుడిగా పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు నటుడిగా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. కమెడియన్ గా కూడా అతడు తన మార్క్ ను చూపించాడు. మొదటిసారిగా అల్లరితో దర్శకుడి అవతారమెత్తి ఆ జోనర్లో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.
అల్లరి సినిమా హిట్ కావడంతో.. తర్వాత ఎన్నో సినిమాలను తెరపైకి ఎక్కించాడు. అందులో నచ్చావులే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత అతడు థ్రిల్లర్లు, హర్రర్ సినిమాల వైపు కన్నేశాడు. అందులో భాగంగానే అతడు హీరోయిన్ల పాత్రలకు ఎక్కువగా భూమిక, పూర్ణలను ఎంచుకున్నాడు.
దాదాపు వీళ్లతోనే ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో రవిబాబుకు వీళ్లకు మధ్య ఏదో ఎఫైర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో కోడై కూశాయి. దీనిపై రవిబాబు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను ఏ సినిమా తీసినా ఆ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ ఒక్కరూ ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడిని కాదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ ఒక్క హీరోయిన్ తో కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు లేవు.
అటువంటి క్యారెక్టర్ నాది కాదు అంటూ చెప్పుకొచ్చాడు. పూర్ణతో వరుసాగా మూడు సినిమాలు తీశాను.. కేవలం ఆమె అభినయం కారణంగానే తన సినిమాల్లో పెట్టుకున్నానని క్లారిటీ ఇచ్చాడు. హీరోయిన్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే.. తనతో మరో సినిమా తీయడానికి ఎలా ముందుకు వస్తారు.. అస్సలు ఇష్టపడతారా.. అంటూ స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ పుకార్లు అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…