Featured

మంచు విష్ణు సన్నిహితులు హైపర్ ఆదిని కొట్టారా?? నిజమెంత ?

జబర్దస్త్ కామెడీ షోలో ప్రేక్షకులను తనదైన పంచ్ లతో కడుపుబ్బా నవ్వించే వ్యక్తి హైపర్ ఆది. అతడిపై ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల మా అధ్యక్ష ఎన్నికలో మంచు విష్ణు వాడిన పదాలను ఇలా ఆది తన స్కిట్ లో వాడుకున్నాడు.

ఈ మధ్య దీపావళి ఈవెంట్లో అతడు మంచు విష్ణు మాట్లాడిన మాటలను పరోక్షంగా ఇమిటేట్ చేశాడు. విష్ణు వాడిన డైలాగులని పలకడంతో అవి వైరల్ అయ్యాయి. ఆది స్కిట్ వల్ల మంచు విష్ణు, అతని సన్నిహితులు కూడా హర్ట్ అయ్యారని తెలుస్తోంది.

అతడి అభిమానులు చాలా కోపంగా ఉన్నారని.. అందుకు ఆది కొన్ని రోజుల వరకు బయట తిరగడం లేదని.. షూటింగ్ లకు కూడా వెళ్లడం లేదని వార్తలు వచ్చాయి. వాటితో పాటు తాజాగా అతడిని కొట్టారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆ స్కిట్ చేయడానికి కారణం నాగబాబు అని.. ఆ స్కిట్ వెనుకాల హస్తం మొత్తం మెగా నాగాబాబుదే అనే అనుమానంతో అతడి అభిమానులు ఆదిని క్షమాపణలు చెప్పాలని కోరారట.

అతడు దానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన అతడి అభిమానులు.. సెట్ పైకి వెళ్లి అతడిపై చెయ్యి చేసుకోవడంతో పాటు.. అక్కడ ఉన్న సామాగ్రిని అంతా ధ్వంసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆది పంచులు కొన్ని సందర్భాల్లో కాంట్రవార్సీలుగా మారడం ఇది కొత్తేమి కాదు.. అంతకు ముందు కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. వాటిపై అతడు క్షమాపణలు కూడా చెప్పాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago