తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ 5. ఇది దాదాపు ఎండ్ కు వచ్చేసింది. హౌస్ లో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. త్వరలో ఒకరు ఎలిమినేట్ అయిపోయి 9 మందితో ముందుకు సాగనుంది. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్నవాళ్లు అంతా స్ట్రాంగ్ అనే చెప్పాలి. వీళ్లకు బయట సెలబ్రిటీల తమదైన శైలిలో సపోర్ట్ చేస్తున్నారు.
ఒకొక్కరూ ఒక్కో విధంగా సోషల్ మీడియాలో ఓట్ ఫర్ శ్రీరామ్, ఓట్ ఫర్ రవి అంటూ.. ఇలా ప్రేక్షకులను వేడుకుంటున్నారు. అయితే సోనుసూద్ కూడా తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ.. తన ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్టు చేశాడు. అందులో ఏముందంటే.. ‘‘అందరికీ హాయ్.. బిగ్ బాస్ సీజన్ 5 చూస్తున్నారా.. నేను కూడా చూస్తున్నాను.. షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్.
అతడికే నా సపోర్ట్.. లవ్ యూ మ్యాన్’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో శ్రీరామ చంద్ర అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ కచ్చితంగా శ్రీరామ్ దే అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోనుసూద్ శ్రీరామ్ కు మద్ధతు తెలపడంతో అతడి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందనేది నెటిజన్లు అభిప్రాయం.
ఎవరు గెలుస్తారు.. ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తారు.. అనేది తెలియాలంటే.. మరి కొన్ని వారాలు ఆగాల్సిందే. ఇప్పటికే హౌస్ లో ఈ వారం బయటకు రావడానికి నామినేట్ అయిన సభ్యులు రవి, సన్ని, మానస్, కాజల్ మరియు సిరి. దీనిలో ఎక్కువగా ఎలిమినేట్ ఛాన్స్ కాజల్, రవికి ఉన్నాయనేది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…