Tag Archives: tolliwood

అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే.. షాక్ లో అభిమానులు..!

టాలీవుడ్ లో కొన్ని సంవత్సరాల వరకు మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ గా​ అనుష్క కొనసాగింది. ఆమె నాగార్జున సరసన సూపర్ సినిమాలో నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వచ్చిన అవకాశాలను వదులుకోకుండా.. తన టాలెంట్ ను నిరూపించుకొని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అనుష్క.

అగ్ర హీరోల సరసన అతి తక్కువ సమయంలో నటించి.. తన ఫేమ్ ను కొనసాగించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమె రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు, బాహుబలి చిత్రాలలో నటించి మరో మైలురాయిని దాటారు. ఈ సినిమాలు ఆమెకు బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. అయితే ఇటీవల కాలంలో అనుష్క ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు.

దానికి కారణం ఏంటో తెలియదు. అవకాశాలు వస్తున్నా ఆమె తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఆమె పెళ్లి ప్రస్తావన గురించి మొదటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది. అనుష్క పెళ్లి ఎప్పుడు చేసకుంటుందా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే 40 ఏళ్లు దాటిని అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఉందట.

ఆమె జాతకంలో ఏదో చిన్న దోషం ఉందట.. అందుకే ఆమెకు పెళ్లి కాలేదు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. ఆమె అభిమానులు మాత్రం షాక్ లో ఉన్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా 48వ ఫిల్మ్ అనౌన్సిమెంట్ వచ్చేసింది. యూవీ క్రియేషన్స్​ ఈ అధికార ప్రకటన చేసింది. త్వరలోనే షూటింగ్​ స్టార్ట్ అవ్వనున్నట్లు వెల్లడించింది. న్యూ ఏజ్​ ఎంటర్​టైనర్​గా ఈ మూవీ రూపొందనుందని తెలిపింది.