Tag Archives: tomatoes benefits

టమోటాలను తింటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చా..?

సాధారణంగా ప్రతి రోజు మన రోజువారి వంటలలో ఉపయోగించే కూరగాయలలో టమోటాలు ఒకటి. టమోటాలకు వంటలలో అధిక ప్రాధాన్యత కలిగి ఉంది. చూడటానికి ఎరుపురంగును కలిగి పుల్లటి రుచితో ఉండే టమోటాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు టమోటాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో రకాల జబ్బుల నుంచి విముక్తి పొందవచ్చు.

టమోటాలలో అధిక భాగం విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ సమృద్ధిగా ఉండి, సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సమస్యలు లేకుండా కాపాడుతుంది. టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలను, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని ఇదివరకే మనం తెలుసుకున్నాం.

తాజా అధ్యయనాల ప్రకారం టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల కాన్సర్ సెల్ లైన్స్ తొలగించడానికి ఉపయోగపడుతుంది. వీటి వల్ల గ్యాస్ట్రిక్ కాన్సర్ తగ్గుతుందని నిపుణులు వెల్లడించారు. క్యాన్సర్ కణాలను తొలగించడంలో టమోటాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మన రోజువారి ఆహారంలో భాగంగా ఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

టమోటాలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కణాలను నశింప చేయడమే కాకుండా ప్రోస్ట్రేట్, సర్వికల్, నోరు, గొంతు ఇలా అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాలు ఇది తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి కనుక టమోటాలను సహజ క్యాన్సర్ ఫైటర్ అని చెప్పవచ్చు.