సాధారణంగా ప్రతి రోజు మన రోజువారి వంటలలో ఉపయోగించే కూరగాయలలో టమోటాలు ఒకటి. టమోటాలకు వంటలలో అధిక ప్రాధాన్యత కలిగి ఉంది. చూడటానికి ఎరుపురంగును కలిగి పుల్లటి రుచితో ఉండే టమోటాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు టమోటాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో రకాల జబ్బుల నుంచి విముక్తి పొందవచ్చు.
టమోటాలలో అధిక భాగం విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ సమృద్ధిగా ఉండి, సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సమస్యలు లేకుండా కాపాడుతుంది. టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలను, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని ఇదివరకే మనం తెలుసుకున్నాం.
తాజా అధ్యయనాల ప్రకారం టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల కాన్సర్ సెల్ లైన్స్ తొలగించడానికి ఉపయోగపడుతుంది. వీటి వల్ల గ్యాస్ట్రిక్ కాన్సర్ తగ్గుతుందని నిపుణులు వెల్లడించారు. క్యాన్సర్ కణాలను తొలగించడంలో టమోటాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మన రోజువారి ఆహారంలో భాగంగా ఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
టమోటాలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కణాలను నశింప చేయడమే కాకుండా ప్రోస్ట్రేట్, సర్వికల్, నోరు, గొంతు ఇలా అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాలు ఇది తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి కనుక టమోటాలను సహజ క్యాన్సర్ ఫైటర్ అని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…