Tag Archives: tomatos

బిర్యానీ ప్రియులకు గుడ్ న్యూస్.. అక్కడ బిర్యానీ ఫ్రీ.. దాని కోసం ఏం చేయాలంటే..

బిర్యానీ అంటే ఎవరు ఇష్టపడరు. ప్రతీ ఒక్కరు లొట్టలేసుకొని మరీ తింటారు. వారి కోసం ఇప్పుడు చెప్పే న్యూస్. ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందేంటంటే.. తమిళనాడులోని అంబూర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

కిలో టమాటా తీసుకొస్తే.. రుచికరమైన బిర్యానీని ఉచితంగా ఇస్తామంటూ ప్రకటన ఇచ్చారు. దీంతో ఆ దుకాణానికి విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. అంతే కాదు అస్సలు ఆ షాప్ ఎక్కడ ఉంది.. అస్సలు అక్కడ జనాలు వస్తారో రారో అన్న స్థితిలో ఉన్న ఆ బిర్యానీ సెంటర్.. ఇప్పుడు ఆ జిల్లాలోనే ఫేమస్ అయిపోయింది. ఇలాంటి ఆఫర్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే.. అక్కడ టామాటాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

దాదాపు కిలో టమాటా రూ.150 పలుకుతోంది. ఈ నేపథ్యంలో చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం ప్రాపర్టీలోని అంబూర్ బిర్యానీ షాప్ యజమాని తన సేల్స్ పెంచుకోవడం కోసం ఒక కొత్త ఆఫర్ కస్టమర్లకు ప్రకటిచారు. దీంతో బిర్యానీ కోసం భోజన ప్రియులు ఎగబడుతున్నారు. అక్కడ ఒక బిర్యానీ రూ.100. ఎవరైనా రెండు కిలోల టమాటాలు కొంటే.. అర కిలో టమాటా ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ప్రకటించారు. అంతే కాదు.. ఒక కేజీ టమాటోలు తీసుకుని వచ్చి ఇస్తే.. ఒక బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ఇవ్వడం వల్ల జనం తండోపతండాలు వస్తున్నారు.

దీంతో గిరాకీ పెరిగింది. తను అనుకున్నది సక్సెస్ అవ్వడంతో షాపు యాజమాని తెగ మురిసిపోతున్నాడు. ఇక ఇలా చేయడానికి మరో ఉద్దేశ్యం కూడా ఉందని చెప్పాడు నిర్వాహకుడు. టమాటా ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఫ్రీ సేల్‌ నిర్వహించినట్లు దుకాణం యజమాని తెలిపారు.

టమోటాలను తింటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చా..?

సాధారణంగా ప్రతి రోజు మన రోజువారి వంటలలో ఉపయోగించే కూరగాయలలో టమోటాలు ఒకటి. టమోటాలకు వంటలలో అధిక ప్రాధాన్యత కలిగి ఉంది. చూడటానికి ఎరుపురంగును కలిగి పుల్లటి రుచితో ఉండే టమోటాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు టమోటాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో రకాల జబ్బుల నుంచి విముక్తి పొందవచ్చు.

టమోటాలలో అధిక భాగం విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ సమృద్ధిగా ఉండి, సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సమస్యలు లేకుండా కాపాడుతుంది. టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలను, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని ఇదివరకే మనం తెలుసుకున్నాం.

తాజా అధ్యయనాల ప్రకారం టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల కాన్సర్ సెల్ లైన్స్ తొలగించడానికి ఉపయోగపడుతుంది. వీటి వల్ల గ్యాస్ట్రిక్ కాన్సర్ తగ్గుతుందని నిపుణులు వెల్లడించారు. క్యాన్సర్ కణాలను తొలగించడంలో టమోటాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మన రోజువారి ఆహారంలో భాగంగా ఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

టమోటాలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కణాలను నశింప చేయడమే కాకుండా ప్రోస్ట్రేట్, సర్వికల్, నోరు, గొంతు ఇలా అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాలు ఇది తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి కనుక టమోటాలను సహజ క్యాన్సర్ ఫైటర్ అని చెప్పవచ్చు.