Tag Archives: traffic police

Jr NTR: జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ కారును ఆపి… సోదాలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు!

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఊహించని చేదు సంఘటన ఎదురయింది. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ముత్తు ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద పెద్దఎత్తున వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.

Jr NTR: జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ కారును ఆపి… సోదాలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు!

ఈ తనిఖీల్లో భాగంగా వాహనాలకు ఉన్నటువంటి బ్లాక్ సీలింగ్, నలుపు తెరలు ఉన్న కార్లను ఆపి నలుపు తెరలను తీసేసి పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారును కూడా ఆపి పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఆ కారులో ఎన్టీఆర్ కుమారుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

Jr NTR: జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ కారును ఆపి… సోదాలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు!

ఇక ఆ కారులో ఉన్న వ్యక్తులు ఎంత చెప్పిన పోలీసులు అతని మాటలు వినకుండా వారి డ్యూటీ వారు నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం ఉండటంతో పోలీసులు ఆ కారుకు ఉన్న బ్లాక్ ఫిలిం తొలగించి పంపించారు. ఈ విధంగా ట్రాఫిక్ పోలీసులు ఎన్టీఆర్ కారు పట్ల బాధ్యతగా వ్యవహరించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

90 వాహనాల పై కేసు నమోదు…

గత రెండు రోజుల నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ విధమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ ఒక్కరోజులోనే 90 వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ విడుదల కావడంతో ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

రామ.. రామ అయేద్య రాముడి పేరుపై ట్రాఫిక్ చలానా.. సీటు బెల్టు పెట్టుకోలేదని..!

దేశంలో ఏ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ అయినా.. నిబంధనలకు విరుద్దంగా ఏ వాహనదారుడు అయినా వ్యవహరిస్తే అతడికి ఫైన్ వేస్తారు. అక్కడ ఆ నిబంధనకు అనుగురణంగా వాళ్లు ఫైన్ల రూపంలో డబ్బులను వసూలు చేస్తారు. అయితే కేరళలోని ట్రాఫిక్ పోలీసులు కాస్తంత అతి చేశారనే అనిపిస్తుంది. ఈ ఘటన చూసిన తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది.

ఫైన్ వేసిన తర్వాత అతడి పేరుతో రసీదు ఇవ్వడం అనేది ట్రాఫిక్ పోలీసుల మొదటి కర్తవ్యం. అయితే ఇక్కడ కేరళ ట్రాఫిక్ పోలీస్ మాత్రం అయోద్య రాముడి పేరుమీద చలాన్ రాసి ఇచ్చాడు. ఇంతకు ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.. కేరళలోని కొల్లాం జిల్లా చాడమంగళంలో ఓ వ్యక్తిని సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని ట్రాఫిక్‌ పోలీసుల ఆపి రూ.500 ఫైన్ వేశారు. అయితే ఇదే కారణంతో అతడు ఒక గంట ముందు ఫైన్ కట్టాడు.

తాను అంతక ముందే కట్టాను అని వాళ్లకు చెప్పినా వినలేదు.. ఇక్కడ కూడా కట్టాలని వాళ్లు చెప్పారు. ఇక ఆ వాహనదారుడు చేసేది లేక అసలు పేరు కాకుండా అతడు.. తన పేరు రామా అని.. తన తండ్రి పేరు దశరథ అని.. ఊరు అయోద్య అని చెప్పాడు. కానీ పోలీస్ ఇవన్నీ వివరాలను ఆ రశీదు పై ఏ మాత్రం సందేహం రాకుండా రాశాడు. ఫైన్ వేశామా.. డబ్బు వసూలు చేశామా అన్నట్లే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కానీ.. వాహనదారుడు ఏ పేరు చెబితే మా కేంటి అన్నట్లు ఉంటుంది.

అలాగే అతడు రసీదు రాసి ఇచ్చాడు. అయితే వాహనదారుడు దానికి సంబంధించి రశీదును సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పోస్టు వైరల్ గా మారింది. నెటిజన్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అతడు చెప్పే పేరు, ఊరును కూడా అడగకుండా ఇలా రశీదు ఎలా రాస్తారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కేరళలో పోలీసులు కారణం లేకుండా ఫైన్లు వేస్తున్నారంటూ.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బైక్ తో పాటు వ్యక్తిని కూడా ఎత్తేశారు ట్రాఫిక్ పోలీసులు.. ఏం జరిగిందంటే..

సాధారణంగా నో పార్కింగ్ ఏరియాలో వాహనాలను నిలిపితే వాటిని ట్రాఫిక్ పోలీసులు పెద్ద వాహనంలో క్రేన్ తో తీసుకెళ్లడం సహజం. కానీ ఇక్కడ ఓ ద్విచక్ర వాహనంపై మనిషి ఉన్నా అతడితో పాటే బండిని కూడాలేపి ట్రాఫిక్ టోయింగ్ వాహనంలో పడేశారు. ఇలా నిబంధనలు ఉల్లఘించే క్రమంలో వాహన యజమానులపై చర్యలు తీసుకునే క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కొన్నిసార్లు విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఇలాంటిదే.. బైక్‌ను నో పార్కింగ్ ఏరియా నుంచి నుంచి తొలగించే సమయంలో.. ఓ వ్యక్తి బైక్‌పై ఉన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. నానాపత్ ప్రాంతంలో ఎప్పటిలాగే ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. నో పార్కింగ్ జోన్ల‌లో ఉన్న వాహనాలను టోయింగ్‌ వాహనంలోకి ఎక్కిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సమర్త్ బ్రాంచ్‌కు చెందిన ట్రాఫిక్ పోలీసుతో పాటు కాంట్రాక్ట్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అయితే వారు ఓ బైక్ ను టోయింగ్ వాహనంలో ఎక్కిస్తున్న క్రమంలో ఆ వాహన యజమాని అక్కడకు చేరుకొని ఆ చర్యను నిలిపే ప్రయత్నం చేశాడు.

ఆ బైక్ ను టోయింగ్ వాహనంలో ఎక్కిస్తుండగా.. దానిపైనే కూర్చున్నాడు. బైక్ నుంచి దిగండంటూ.. ఎంత చెప్పినా అతడు ట్రాఫిక్ పోలీసుల మాట వినలేదు. దీంతో అతడు బైక్ పై ఉన్నా కూడా ఆ బండిని వాహనంలో ఎక్కించేశారు. అయితే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు.. పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ రాహుల్ శ్రీరామ్ స్పందిస్తూ.. టోయింగ్ వ్యాన్‌లోని బైక్‌ను ఎక్కించిన తర్వాత ఈ ఘటన జరిగిందని అన్నారు.

బైక్‌పై దాని యజమాని ఎక్కే సమయానికే పూర్తిగా ఎత్తివేయబడిందని చెప్పారు. అతడిని సిబ్బంది వారించినా వినలేదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే బైక్‌ను, అతడితోపాటుగా వ్యాన్ క్యారేజ్‌పై ఉంచబడిందన్నారు. అయితే తర్వాత సదరు వ్యక్తి క్షమాపణ చెప్పాడని.. జరిమానా కూడా చెల్లించినట్లు చెప్పారు. ఈ ఘటనలో పాల్గొన్న కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులపై చర్యలకు ఆదేశించినట్లు అతడు పేర్కొన్నారు.

కొత్త హెల్మెట్ కొంటున్నారా.. ఈ తప్పు చేస్తే నష్టపోయినట్లే..?

టాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాహనదారులకు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచనలు చేస్తుంటారు. అయితే హెల్మెట్ ను కొనుగోలు చేసేవాళ్లు బ్రాండెడ్ కంపెనీల హెల్మెట్లను దుకాణాల ద్వారా, ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తే మంచిది. రోడ్లపై, అపరిచిత వ్యక్తుల నుంచి హెల్మెట్లను కొనుగోలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.


సైబరాబాద్ పోలీసులు తాజాగా నకిలీ హెల్మెట్లు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ హెల్మెట్ల తయారీ జరుగుతోందని యూపీ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు ఆ హెల్మెట్ల సరఫరా జరుగుతుందని అధికారులు గుర్తించారు. నాసిరకం హెల్మెట్లను వినియోగించడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో తలకు గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నాణ్యత లేని హెల్మెట్లు ధరించడం, హెల్మెట్లు ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువమంది మృతి చెందుతున్నారని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80 మంది వాహనదారులు నకిలీ హెల్మెట్ ను ధరించడం వల్ల ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడిస్తున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు నకిలీ హెల్మెట్లపై isi మార్క్ వేసి విక్రయిస్తున్నారని చెబుతున్నారు.

ప్లాస్టిక్, ఫైబర్, థర్మాకోల్ తో ప్లాస్టిక్ హెల్మెట్లు తయారవుతున్నాయని తెలుస్తోంది. నకిలీ హెల్మెట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు 100 రూపాయలుగా ఉంటే మార్కెట్ లో 500 రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తానికి ఈ హెల్మెట్లను విక్రయిస్తున్నారని సమాచారం.