Tag Archives: trs

సీఎం కేసీఆర్ కు పాదాభివందనం _ గెల్లు శ్రీనివాస్

హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పై గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. పార్టీ కోసం తాను చేసిన సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు పాదాభివందనం తెలియజేస్తున్నానని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుకి అప్పజెప్పారని శ్రీనివాస్ పేర్కొన్నారు.

కాగా పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు కెసిఆర్ గొప్ప అవకాశం కల్పించారని శ్రీనివాస్ తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యమ నేతకు దక్కిన గుర్తింపు_ మంత్రి తలసాని

హుజరాబాద్ నియోజకవర్గానికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం పై మంత్రి తలసాని స్పందించారు. యువకుడు, ఉత్సాహవంతుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యమ నేతకు దక్కిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.

కాగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలను అమలు చేస్తారాని అని ప్రశ్నించారు.

ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు_ సీతక్క

ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలియజేశారు.ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు, నేతలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల వచ్చిన ప్రతిసారి తెరాస ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. హుజూరాబాద్​ ఉపఎన్నిక కోసమే సీఎం కేసీఆర్ దళిత బందు తీసుకు వచ్చారన్నారు.

కాగా గిరిజనుల పోడు భూములకు పట్టాల కోసం గత కొంత కాలంగా కాంగ్రెస్​ పార్టీ పోరాడుతోందని సీతక్క పేర్కొన్నారు. పోడు భూములకు కాంగ్రెస్​ హక్కులు కల్పించిందని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికి పట్టాలు ఇవ్వకుండా.. ఉన్న భూమిని లాక్కుంటున్న చరిత్ర కేసీఆర్​ది అని విమర్శించారు.

రేవంత్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్!

టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే ఇంద్రవెల్లి సభను పెట్టుకున్నారని తెరాస ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై రేవంత్ భాష సరిగా లేదని.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.ఎంపీగా గౌరవ భాష మాట్లాడాలన్నారు.

దళితులను చిన్నచూపు చూసే రేవంత్​ను తెలంగాణ సమాజం సహించదన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దళిత బంధు పథకమంటే రేవంత్ రెడ్డికి కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సహించలేకనే అరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ఓబీసీ బిల్లుకు టిఆర్ఎస్ మద్దతు!

లోక్‌స‌భ‌లో కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుకు వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఓబీసీ బిల్లుకు మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ ఎంపీ భీమ్‌రావ్ బ‌స్వంతరావ్ పాటిల్‌ లోక్ సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 కులాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోనూ అనేక కులాలు ఓబీసీ జాబితాలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాయ‌న్నారు.

లోక్‌స‌భ‌లో కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుకు వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఓబీసీ బిల్లుకు మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ ఎంపీ భీమ్‌రావ్ బ‌స్వంతరావ్ పాటిల్‌ లోక్ సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 కులాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోనూ అనేక కులాలు ఓబీసీ జాబితాలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాయ‌న్నారు.

నా కన్నా గొప్ప నటుడు కేసీఆర్.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..?

ప్రముఖ నటి విజయశాంతి రెండు రోజుల క్రితం బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చిన విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 1998 సంవత్సరం నుంచే తెలంగాణ కోసం పోరాడానని.. బీజేపీలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేస్తే అప్పట్లో తెలుగుదేశం పార్టీ తనను వ్యతిరేకించిందని అమె అన్నారు.

ఆ తరువాత తెలంగాణ కోసం తాను బీజేపీని వీడి తల్లి తెలంగాణ అనే పార్టీని పెట్టానని కేసీఆర్ కు ఆ సమయంలో మంత్రి పదవి దక్కకపోవడంతో తెలంగాణ ఉద్యమంలోకి ఆయన వచ్చారని తెలిపారు. కేసీఆర్ తనను పార్టీలో కలుపుకోవాలని అప్పట్లో చాలా ప్రయత్నాలు చేశాడని.. పార్టీ కోసం తాను బాగా కష్టపడుతున్నానని కేసీఆర్ చెబితే తనకు నవ్వొచ్చిందని ఆమె అన్నారు. తాను ఎంపీగా విజయం సాధించినప్పటి నుంచి కేసీఆర్ తనను లేకుండా చేయాలని చూశాడని చెప్పారు.

తాను బీజేపీ పార్టీలో ఉన్న సమయంలో సోనియా గాంధీ మీద పోటీ చేయాలని తనకు కేసీఆర్ సూచించాడని.. కేసీఆర్ గురించి గతంలో వైఎస్సార్ ను కలిసి తాను వివరించానని అన్నారు. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళితే తన మనుషులతో కేసీఆర్ బూతులు తిట్టించాడని.. కేసీఆర్ కావాలనే తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. తాను ఒక్కడే ఎదగాలనే స్వార్థంతో కేసీఆర్ అలా చేశాడని చెప్పారు.

తనకంటే కేసీఆర్ గొప్ప నటుడని ఆయన మాటలు నమ్మి తల్లి తెలంగాణ పార్టీని ఆయన పార్టీలో కలిపేశానని ఆమె చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తన దగ్గరకు వస్తానని చెప్పి లక్ష రూపాయలు లేవనే కారణంతో రాలేదని.. ఇప్పుడు మాత్రం కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించాడని కామెంట్లు చేశారు.