Tag Archives: volunteers

కోవిడ్ పై పోరాటానికి తమిళనాడు బీజేపీ కొత్త అస్త్రం!

కోవిడ్ థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు బిజెపి నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు సహాయపడేందుకు 26,000 మంది వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై పేర్కొన్నారు.

కాగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన డీఎంకే వంటి పార్టీలు వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తున్నాయని గుర్తు చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.

ప్రజలకు అలర్ట్.. ఫిబ్రవరి నుంచి వారికి రేషన్ లేనట్టేనా..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారు రేషన్ కార్డును కలిగి ఉంటే రేషన్ సరుకులను పొందవచ్చనే సంగతి తెలిసిందే. ప్రతి నెలా రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు రేషన్ డీలర్ ను సంప్రదించి సరుకులను పొందవచ్చు. అయితే ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఈ కేవైసీ చేయించని 64,800 కార్డులను రేషన్ ను నిలిపివేయనున్నారని తెలుస్తోంది. వీరికి సరుకుల సరఫరా తాత్కాలికంగా ఆగనుందని ప్రచారం జరుగుతోంది.

ఈ కేవైసీ పూర్తి కాని కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసిన తరువాతే సరుకులను పొందే అవకాశం ఉంటుందని సమాచారం. అధికారులు గడిచిన మూడు నెలల నుంచి ఈకేవైసీ చేయించుకోవాలని రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సూచనలు చేస్తున్నా ఈకేవైసీ చేయించుకోవడంలో కొందరు లబ్ధిదారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. దీంతో ఈకేవైసీ చేయించుకోని వారికి రేషన్ నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో మొత్తం 8.7 లక్షల కార్డుదారుల్లో 64,800 మంది కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదు. జగన్ సర్కార్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల నుంచి రేషన్ డోర్ డెలివరీ పంపిణీ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేసుకోని వారు గ్రామ, వార్డు వాలంటీర్లను కలవడం లేదా సమీపంలోని గ్రామ, వార్డ్ సచివాలయ అధికారులను సంప్రదించడం ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.

అధికారులే స్వయంగా ఈకేవైసీ చేయించుకోకపోతే సరుకుల పంపిణీ జరగదని చెబుతుండటం గమనార్హం. ఈకేవైసీ చేయించుకోక పోతే కార్డులు రద్దయ్యే అవకాశం కూడా ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.

ఏపీ ప్రజలకు శుభవార్త.. రేషన్ డోర్ డెలివరీ ఎప్పటినుంచంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021 సంవత్సరం జనవరి నుంచి రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. గతంలోనే ఈ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొనిరావాలని జగన్ సర్కార్ ప్రయత్నించినా వివిధ కారణాల వల్ల ఈ నిర్ణయం అమలు వాయిదా వడుతూ వస్తోంది. పౌరసరఫరాల శాఖ డోర్ డెలివరీ కోసం వాహనాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది.

జగన్ సర్కార్ డోర్ డెలివరీ వాహనాలకు సంబంధించి టెండర్లను ఇప్పటికే ఖరారు చేసింది. ఈ టెండర్లకు సంబంధించిన కాంట్రాక్ట్ టాటా మోటార్స్ సంస్థకు దక్కింది. మరోవైపు లబ్ధిదారులకు ఇచ్చే సంచులు, వాహనాలలో అమర్చే కాటాలకు సంబంధించి కూడా టెండర్లు ఖరారయ్యాయని సమాచారం. ప్రభుత్వం 520 కోట్ల రూపాయలు డోర్ డెలివరీ చేసే వాహనాల కొనుగోలు కోసం ఖర్చు చేయనుండగా టాటా మోటార్స్ సంస్థ ఒక్కో వాహనాన్ని 5.72 లక్షల రూపాయలకు టెండర్ దక్కించుకుందని తెలుస్తోంది.

సంక్షేమ కార్పొరేషన్ల నుంచి జగన్ సర్కార్ ఈ నిధులను ఖర్చు చేయనుందని తెలుస్తోంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. అయితే ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో జగన్ సర్కార్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా రేషన్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

డోర్ డెలివరీ వాహనాల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు ఇంటి దగ్గరే అందే విధంగా జగన్ సర్కార్ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం తీసుకున్న రేషన్ డోర్ డెలివరీ నిర్ణయాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోందని చెబుతున్నారు.