Tag Archives: women police

మహిళా కానిస్టేబుళ్లకు గుడ్ న్యూస్.. మారిన పని వేళలు..

ఒక మహిళ పోలీసు ఉద్యోగం చేసినా ఇంటికి మాత్రం ఇల్లాలే కదా.. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర పోలీసు విభాగం గుర్తించింది. పోలీస్ ఫోర్స్‌లోని మహిళా సిబ్బందికి 8 గంటల పని వేళలను అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అంతకు ముందు మహారాష్ట్ర డీజీపీ సంజయ్ పాండే మహిళలకు హామీ కూడా ఇచ్చారు.

దీనిలో భాగంగానే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దీనిని అమలు చేస్తున్నామని, ఇవే పనివేళలను త్వరలో దశల వారిగా రాష్ట్రమంతటా అమల్లోకి తెస్తామని అతడు చెప్పారు. ఇదిలా ఉండగా..12 గంటల వరకు పని ఉన్నా.. చేస్తున్నామని.. కానీ అంతకు మించి కూడా మాతో పనులు చేయించుకుంటున్నారని.. దీంతో కుటుంబబాధ్యతల నిర్వహణపై పని భారం పుడుతోందని పలువురు మహిళా కానిస్టేబుళ్ల ఇటీవల డీజీపీ దృష్టికి తెచ్చినట్టు ఒక అధికారి తెలిపారు.

దీనిని పరిగణలోకి తీసుకొని పోలీసు అధికారులు ఆ పని వేళలలను 12 నుంచి 8 గంటలకు విషయమై సీనియర్ అధికారులతో పాండే చర్చించారు. దీంతో చివరకు ఇంటి బాధ్యతలను సమతుల్యం చేసుకునేలా మహిళా కానిస్టేబుళ్ల పనివేళలను 12 నుంచి 8 గంటలకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నాగపూర్, పుణె, అమరావతి, నవీ ముంబైలలో ఇప్పటికే 8 గంటల పనివేళలను విజయవంతంగా అమల్లోకి తెచ్చారు.

మొట్టమొదటగా నాగపూర్ లో ఆగస్టు 28 న అమలు చేశారు. ఆ అమలు విజయవంతంగా అయింది. దాని ఫలితాలను పరిగణలోకి తీసుకొని మిగతా చోట్ల కూడా అమలయ్యేలా చూడాలని ఉత్తర్వులు జారీ చేశారు.మరో నెలరోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

అమాయకుడిని మోసం చేయాలని చూసిన మహిళా పోలీస్.. చివరకు ఏమైందంటే..!

చట్టం ఎవరికీ చుట్టం కాదు. చేతిలో అధికారం ఉంది కదా.. అని లంచాలకు పాల్పడితే ఏదో ఒక రోజు శిక్ష అనుభవించడం అనేది జరుగుతుంది. ఇలానే ఓ మహిళా పోలీసు ఓ అమాయకుడి దగ్గర డబ్బులు తీసుకొని అబద్దం ఆడింది. చివరకు అతడు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు శివగంగ జిల్లా ఇళయాంకుడికి చెందిన అర్షద్.. ఓ బిజినెస్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అతడికి తెలిసిన వారి వద్ద సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. వాటిని అతడు తన బ్యాగ్ లో భద్రపరుచుకున్నాడు. ఇంకా తనకు డబ్బులు అవసరం ఉండటంతో అతడు తన సోదరుడితో బైక్ పై నాగమలై పుదుకొట్టైకు వెళ్లాడు. అక్కడ అర్షద్ తన సోదరుడు డబ్బులు ఇస్తామన్న స్నేహితుడి కోసం ఎదురుచూశారు. ఆ ప్రదేశానికి అక్కడే పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై వాసంతి వచ్చారు. ఆ బ్యాగ్ లో ఏముందంటూ తీసుకున్నారు.

రేపు స్టేషన్ కు వచ్చి ఆ బ్యాగ్ ను కలెక్ట్ చేసుకోమని చెప్పారు. దీంతో వాళ్లు తెల్లారి స్టేషన్ కి వెళ్లి బ్యాగ్ అడిగారు. అందులో న్యూస్ పేపర్స్ తప్ప.. డబ్బులు లేవని ఆ మహిళా ఎస్సై సమాధానం ఇచ్చింది. దీంతో అతడు మధురై జిల్లా ఎస్పీకి విషయం చెప్పాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వాసంతిని, ఆమె సోదరుడు, మరో ముగ్గురు కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అంతే కాకుండా ఆమెను విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఆమె దీనిపై కోర్టును ఆశ్రయించగా వాదోపవాదనల తర్వాత ఆమె వద్ద రూ.2.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారికి కోర్టు సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధించింది.