Tag Archives: Young Kids

18 ఏళ్ల లోపు పిల్లలకు విదేశాలకు అనుమతి ఉందా..పలు దేశాలు కరోనా నిబంధనలు ఎలా ఉన్నాయి?

కరోనా వ్యాప్తి ప్రస్తుతం దాదాపు తగ్గుముఖం పట్టిందనే చెప్పవచ్చు. ఎందుకంటే వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికులను ఆ దేశ ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి. కానీ కచ్చితంగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారే ఇలా ప్రయాణాలు చేయాలంటూ నిబంధనలు విధించాయి. అయితే ఇప్పటికే చాలామంది వ్యాక్సిన్ వేసుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.

కానీ వారికి వచ్చిన చిక్కు ఏంటంటే.. తమ వెంట పిల్లలను తీసుకెళ్లొచ్చా.. లేదా అనేది. ఎందుకంటే 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దీంతో పిల్లలను తమ వెంట తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుందా.. లేదా అనే సందిగ్దంలో ఉన్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని దేశాలు నిబంధనలు విధించింది. ప్రపంచ వ్యాప్తంగా హాంకాంగ్​కు ఎంతో మంది వెళుతుంటారు. ఉద్యోగాలతో పాటు పర్యాటకంగానూ ఆ దేశానికి చాలా ప్రయాణిస్తుంటారు.

ఈ క్రమంలోనే పిల్లల కోసం ఆ దేశం ప్రత్యేక నిబంధలను అమలులోకి తెచ్చింది. వ్యాక్సినేషన్ పూర్తికాని పిల్లలు తమ దేశంలోకి రావాలంటే 72 గంటలకు మించకుండా నెగెటివ్ వచ్చిన టెస్టు రిపోర్టును సమర్పించడంతో పాటు ప్రభుత్వ పరిధిలో 21 రోజులు క్వారంటైన్​లో ఉండాలనే రూల్ పెట్టింది. ఆ సమయంలోనూ మరికొన్ని కరోనా టెస్టులు చేయించుకోవాల్సి వస్తుందని ప్రకటించింది. దీంతో ఆ దేశానికి వెళితే పిల్లలకు పెద్దలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చైనా విషయానికి వస్తే 16 ఏళ్ల లోపు వారు కచ్చితంగా 16 రోజులు క్వారంటైన్ లో ఉండాలంటూ నిబంధన విధించారు.

ఆమెరికా, ఆస్ట్రేలియా దేశాలల్లో పిల్లలు వెళ్లాలంటే నిబంధనల్లో కాస్త ఊరటను కల్పించారు. అమెరికాకు వెళ్లే వారిలో మూడు రోజుల ముందు కరోనా నెగెటివ్ రిపోర్ట్ చూపిస్తే సరిపోతుంది. అక్కడకు చేరిన తర్వాత 5 రోజులు క్వారంటైన్ లో ఉండాలి. ఆస్ట్రేలియాలో అయితే 4 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు నెగెటివ్ రిపోర్టు అవసరం లేదు. మిగతా వారు నెగెటివ్ రిపోర్టు చూపిస్తే సరిపోతుంది. ఏదేమైనా విధులకు హాజరయ్యేందుకు విదేశాలకే వెళ్లే వారు ఇలాంటి నిబంధనలతో కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు.