Tag Archives: ysr jalakala scheme

ఏపీ రైతులకు జగన్ గుడ్ న్యూస్.. ఖాతాల్లో నగదు జమ చేయనున్న ప్రభుత్వం..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ జలకళ, రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక విధాలుగా జగన్ సర్కార్ ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని రైతులు లబ్ధి పొందుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ రైతులకు రెండు శుభవార్తలు చెప్పింది.

వైఎస్సార్ జలకళ స్కీమ్ కు సంబంధించిన నిబంధనలలో జగన్ సర్కార్ కీలక మార్పులు చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం రైటైర్ అయిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్సార్ జలకళ స్కీమ్ కు అర్హత పొందలేరు. రెండున్నర ఎకరాల భూమి ఉన్న రైతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెండున్నర ఎకరాల భూమి లేకపోతే రైతులు గ్రూపుగా ఏర్పడి వైఎస్సార్ జలకళ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే ఒక కుటుంబంలో ఒకరు ఈ స్కీమ్ కు అర్హత పొందితే మరొకరు ఈ స్కీమ్ కు అర్హత పొందలేరు. మరోవైపు జగన్ సర్కార్ రాష్ట్రంలో నేటి నుంచి వైఎస్సార్ పంటల బీమా స్కీమ్ ను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని 9.50 లక్షల మంది రైతులకు ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ప్రయోజనం కల్పిస్తుండగా 1252 కోట్ల రూపాయలు బీమా పరిహారం రూపంలో రైతులకు అందుతుంది. బీమా పొందిన రైతులకు వారి మొబైల్ ఫోన్లకు సందేశాలు వస్తాయి.

జగన్ సర్కార్ ప్రతి ఎకరాన్ని ఈ క్రాప్ లో నమోదు చేయించడంతో పాటు నష్టపోయిన రైతులకు ఖాతాలలో నగదును జమ చేస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి నగదు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలో జమవుతుంది.