Tammareddy Bharadwaj: హీరోలు కథలో వేలు పెట్టడం మానేయాలి.. విశ్వక్ తీరుపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Tammareddy Bharadwaj: గత రెండు రోజులుగా సినిమా ఇండస్ట్రీలో విశ్వక్ సేన్, యాక్షన్ హీరో అర్జున్ మద్యం వివాదం చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తెను ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేస్తూ విశ్వక్ హీరోగా సినిమా చేయాలని భావించారు. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా ప్రారంభమై చివరికి సినిమా షూటింగ్ ప్రారంభించాలనుకున్న సమయంలో విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ విషయం వివాదంగా మారింది.

ఈ క్రమంలోనే అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ డెడికేషన్ లేని హీరో అంటూ కామెంట్ చేయగా ఇండస్ట్రీలో ఏ ఒక్కరు తనకు డేడికేషన్ లేదని చెప్పిన తాను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను అంటూ అర్జున్ మాటలకు విశ్వ కౌంటర్ ఇచ్చారు.ఇకపోతే ఈ వివాదం పై తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ విషయంపై మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ విషయంపై తమ్మారెడ్డి మాట్లాడుతూ అర్జున్ సినిమా విషయంలో విశ్వక్ వ్యవహరించిన తీరు దర్శక నిర్మాతలకు అవమానకరం అంటూ ఈయన వ్యాఖ్యానించారు. ఒక హీరో సినిమా అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత తప్పకుండా ఆ సినిమాలో నటించాల్సిందే తనకు నచ్చకపోతే ముందుగానే తనకు నచ్చలేదని చెప్పాలి కానీ కమిట్ అయిన తర్వాత సినిమా నచ్చలేదు పాటలు నచ్చలేదంటే కుదరదు. ఇలాంటి విషయాలన్నీ అగ్రిమెంట్ కుదుర్చుకు ముందే మాట్లాడుకోవాలని తెలిపారు.

Tammareddy Bharadwaj: హీరోల యాటిట్యూడ్ వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి..

ఇకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ హీరోలు చూపిస్తున్నటువంటి ఆటిట్యూడ్ కారణంగానే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఈయన తెలిపారు. ముఖ్యంగా యంగ్ హీరోలు సినిమా కథల విషయంలో జోక్యం చేసుకోవడం మానేయాలి.ఇలా హీరోలు కథ విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని గతంలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలు సైతం ఒకసారి కథ ఫైనల్ అయిన తర్వాత డైరెక్టర్లు ఏది చెబితే అది చేసేవారు కానీ ప్రస్తుత హీరోలు అలా లేరంటూ ఈయన మండిపడ్డారు.