Samantha: సమంత గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో పెద్ద ఎత్తున నిలుస్తున్నారు.ఈమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అంటే సోషల్ మీడియాలో వార్తల రావడంతో ఈ వార్తలపై సమంత స్పందిస్తూ తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ వ్యాధి కారణంగా తాను ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాననీ తాను ఆ వ్యాధితో పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఈ విధంగా సమంత అనారోగ్యం గురించి ఎంతోమంది స్పందిస్తూ తాను క్షేమంగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇకపోతే సమంత నటించిన పాన్ ఇండియా చిత్రం యశోద సినిమా నవంబర్ 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లకు కూడా సమంత దూరంగా ఉన్నారు. అయితే తాజాగా యాంకర్ సుమతో కలిసి ఒక రికార్డు ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంత ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన అనారోగ్యం గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
తాను భయంకరమైన వ్యాధితోనే పోరాడుతున్నానని అయితే ఈ వ్యాధితో యుద్ధం చేసే చివరికి తానే గెలుస్తానని ఈమె ధీమా వ్యక్తం చేశారు. అయితే తన జీవితంలో ఎన్నో మంచి రోజులు చెడు రోజులు వచ్చాయి. ఒక అడుగు ముందుకు కూడా వేయలేకపోతున్నాననే భావన నుంచి తాను జీవితంలో చాలా వరకు ముందుకు వచ్చానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ఇకపోతే నా అనారోగ్యం గురించి చాలామంది ఎన్నో రకాల వార్తలు రాశారు. కొన్నిసార్లు ఆ వార్తలు చూసినప్పుడు బాదేస్తుందనీ, వాటి గురించి తాను పట్టించుకోనని తెలిపారు.సమంత ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉందన్నట్టు వార్తలు రాశారు. ప్రస్తుతానికి నేను బతికే ఉన్నానని ఇంకా చచ్చిపోలేదని ఈమె ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన అనారోగ్య పరిస్థితి గురించి గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…