Tarakaratana: విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి… శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న డాక్టర్స్!

Tarakaratana: నందమూరి తారకరత్న అనారోగ్యానికి గురై దాదాపు 20 రోజులు కావస్తున్న ఇప్పటికి తారకరత్న స్పృహలోకి రాలేదు దీంతో అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తారకరత్న ఆరోగ్య విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో భాగంగా పాల్గొన్నటువంటి తారకరత్న ఉన్నఫలంగా స్పృహ తప్పి పడిపోయారు. అయితే ఆయనని ప్రథమ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు స్ట్రోక్ వచ్చిందని తెలియగానే మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.

బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న చికిత్స తీసుకుంటున్నారు అయితే ఈయన ఆసుపత్రిలో చేరి దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా స్పృహలోకి రాకపోవడంతో ఈయన ఆరోగ్యం పరిస్థితి పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అని పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

విదేశీ నిపుణుల సమక్షంలో తారకరత్నకు చికిత్స జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 16వ తేదీ ఈయనకు మరోసారి స్కానింగ్ నిర్వహించగా ఈయన శరీర భాగాలన్నీ కూడా స్పందిస్తున్నాయని అయితే మెదడు పని తీరు మాత్రం ఏమాత్రం స్పందించలేదని తెలుస్తుంది. ఇకపోతే వైద్యులు ఈయనకు స్కానింగ్ నిర్వహించిన తర్వాత త్వరలోనే తన హెల్త్ అప్డేట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Tarakaratana:మెరుగుపడని మెదడు పనితీరు….


ఇలా తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆ సమయంలో మెదడుకు సరైన స్థాయిలో ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఆయన మెదడు పనితీరుపై తీవ్రమైన ప్రభావం పడిందని, నిపుణులు తెలియజేశారు.అయితే తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.