ఐసీసీ ర్యాంకింగ్స్ : రెండో ర్యాంకుకు ఎగబాకిన టీమ్ ఇండియా ఆల్ రౌండర్ జడేజా..!

ప్రస్తుతం టీమ్ ఇండియాలో చెప్పుకోదగ్గ ఆల్ రౌండర్ లలో రవీంద్ర జడేజా ఒకరు. తాజగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను వెనక్కి నెట్టి రెండో ర్యాంకు ఎగబాకాడు.

టెస్టు క్రికెట్ ఆల్ రౌండర్ల జాబితాలో 423 పాయింట్లతో వెస్టిండీస్ క్రికెటర్ జేసన్ హోల్డర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రెండవ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో ర్యాంకింగ్స్ లో ముగ్గురు భారత ఆటగాళ్లుకు చోటుదక్కింది..టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్, ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా 5,6,7 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.