సాధారణంగా సినిమాలలో నటించేవారు ఎన్నో రకాల సన్నివేశాలలో వివిధ రకాల హావ భావాలను వ్యక్త పరుస్తూ నటించాల్సి ఉంటుంది. అయితే ఎన్నో సినిమాలలో ముద్దు సీన్స్ ఉంటాయి. ఈ విధమైనటువంటి సీన్స్ ఉన్నప్పుడు సదరు నటీనటులు వారి ముఖకవళికలను, హావభావాలను వ్యక్తపరుస్తూ నటించడం కాకుండా జీవించాల్సి ఉంటుంది.మరి ఈ విధమైనటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తాజాగా బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా వెల్లడించారు.
“లేడీస్ వర్సెస్ రికీ భాల్” సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమాలో అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత ఇండస్ట్రీలో పలు అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. తన కెరీర్లో ఎన్నో ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకొని ఎన్నో వాణిజ్య ప్రకటనలకు ప్రచారకర్తగా వ్యవహరించిన పరిణితి చోప్రా తాజాగా సినిమాలలో ఉండే ముద్దు సీన్లపై స్పందించారు.
పరిణితి చోప్రా హీరోయిన్ గా నటించిన ఇషక్ జాదే, శుద్ దేశీ రొమాన్స్, హస్సీ తో పాసి వంటి పలు సినిమాల్లో రొమాంటిక్ సీన్స్‌లో జీవించందని చెప్పాలి. ముఖ్యంగా ముద్దు సీన్లలో ఈమె రొమాన్స్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై స్పందించిన పరిణితి చోప్రా ఈ విధమైనటువంటి రొమాంటిక్ సీన్లు చిత్రీకరించే సమయంలో కట్ అంటే కట్ అని అంటోంది. జస్ట్ సినిమా కోసమే చేస్తాం.. అంతే కానీ అలాంటి సన్నివేశాలపై ఆ తర్వాత ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని తెలిపారు.
సినిమాల చిత్రీకరణ సమయంలో ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు చిత్రీకరణ పూర్తిగా యాంత్రికంగా ఉంటుందని అలాంటప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని తెలిపారు. ఈ విధంగా ముద్దు సీన్లపై పరిణితి చోప్రా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…