Movie News

నాన్న ఎప్పుడు అలాంటి చిత్రాలే తీశారు.. సురేష్ బాబు?

ప్రముఖ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ డి.రామానాయుడు వివిధ భారతీయ భాషల్లో అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా ప్రపంచ రికార్డ్ సృష్టించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ సాధించాడు. డి.రామానాయుడు గారు ప్రకాశం జిల్లా కారంచేడులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో 1963లో “అనురాగం” అనే సినిమాతో ఇండస్ట్రీలో నిర్మాతగా మారి అనతికాలంలోనే స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగాడు.

రామానాయుడు గారు అనతికాలంలోనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రారంభించి ఈ బ్యానర్లో
మొదటి సినిమా రాముడు-భీముడు ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించాడు.సినిమా భారీ విజయం నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడమే కాకుండా ఎన్నో విలువలతో కూడిన సినిమాలను నిర్మించారు రామానాయుడు గారు.

ఆ రోజుల్లో రామానాయుడుగారు నటన మీద ఉన్న ఆసక్తితో “నమ్మిన బంటు” అనే సినిమాలో నటించాడు. రామానాయుడుగారు నిర్మాతగా తెలుగు, హిందీ,తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ ఇలా రూపాయి నోటు మీద కనిపించే అన్నీ భాషల్లోనూ సినిమాలు తీశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంగ్లీష్ భాషలో కూడా సినిమాలను నిర్మించారు. నాన్న ఏ సినిమా నిర్మించిన అది విలువలతో కూడుకున్న సినిమాలను నిర్మించేవారు.

రామానాయుడు నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో దాదాపు ఇరవై మంది కొత్త దర్శకులును, ఆరుగురు హీరోలను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.2015 ఫిబ్రవరి 18న రామానాయుడు తుదిశ్వాస విడిచాడు. ఇటీవలే రామానాయుడు 86వ జయంతి సందర్భంగా వంశీ గ్లోబల్‌ అవార్డ్స్‌, ఇండియా, సంతోషం ఫిలిమ్‌ న్యూస్‌, తెలుగు కళాసమితి ఆధ్వర్యంలోసంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు పలువురు సినీ పెద్దలు పాల్గొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago