ముద్దు సీన్స్ చేసేప్పుడు అలాంటి ఫీలింగ్.. నటి కామెంట్స్ వైరల్!

0
56

సాధారణంగా సినిమాలలో నటించేవారు ఎన్నో రకాల సన్నివేశాలలో వివిధ రకాల హావ భావాలను వ్యక్త పరుస్తూ నటించాల్సి ఉంటుంది. అయితే ఎన్నో సినిమాలలో ముద్దు సీన్స్ ఉంటాయి. ఈ విధమైనటువంటి సీన్స్ ఉన్నప్పుడు సదరు నటీనటులు వారి ముఖకవళికలను, హావభావాలను వ్యక్తపరుస్తూ నటించడం కాకుండా జీవించాల్సి ఉంటుంది.మరి ఈ విధమైనటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తాజాగా బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా వెల్లడించారు.

“లేడీస్‌ వర్సెస్‌ రికీ భాల్‌” సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమాలో అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత ఇండస్ట్రీలో పలు అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. తన కెరీర్లో ఎన్నో ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకొని ఎన్నో వాణిజ్య ప్రకటనలకు ప్రచారకర్తగా వ్యవహరించిన పరిణితి చోప్రా తాజాగా సినిమాలలో ఉండే ముద్దు సీన్లపై స్పందించారు.

పరిణితి చోప్రా హీరోయిన్ గా నటించిన ఇషక్ జాదే, శుద్ దేశీ రొమాన్స్, హస్సీ తో పాసి వంటి పలు సినిమాల్లో రొమాంటిక్ సీన్స్‌లో జీవించందని చెప్పాలి. ముఖ్యంగా ముద్దు సీన్లలో ఈమె రొమాన్స్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై స్పందించిన పరిణితి చోప్రా ఈ విధమైనటువంటి రొమాంటిక్ సీన్లు చిత్రీకరించే సమయంలో కట్ అంటే కట్ అని అంటోంది. జస్ట్ సినిమా కోసమే చేస్తాం.. అంతే కానీ అలాంటి సన్నివేశాలపై ఆ తర్వాత ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని తెలిపారు.

సినిమాల చిత్రీకరణ సమయంలో ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు చిత్రీకరణ పూర్తిగా యాంత్రికంగా ఉంటుందని అలాంటప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని తెలిపారు. ఈ విధంగా ముద్దు సీన్లపై పరిణితి చోప్రా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here