Team India Vs England: రికార్డ్స్ పరంగా ఎవరు బలంగా ఉన్నారు? ఇండియానా? ఇంగ్లాండ్?

Team India Vs England: ఈ టీ20 ప్రపంచ కప్ క్రికెట్ అభిమానులకి ఇప్పటివరకూ ఫుల్ మీల్స్ పెట్టింది. ఎన్నో అద్భుతాలు చేస్తాయి అనుకున్న జట్లు ఇంటికి పంపివేయబడ్డాయి. పసికూనలు అనుకున్న జట్లు పెద్ద జట్లకు చెమటలు పట్టించాయి. ఇంటికి వెళ్ళిపోతుంది అనుకున్న పాకిస్తాన్ అనూహ్యంగా సెమీస్ కి వెళ్ళి అక్కడి నుంచి ఫైనల్ కి చేరింది. ఎవరూ అనుకుని ఉండరు పాకిస్తాన్ సెమీస్ కి వెళ్ళగలదు అని. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పాకిస్తాన్.

టీమిండియా ఇంగ్లాండ్ లలో రికార్డ్స్ పరంగా ఎవరు మెరుగ్గా ఉన్నారు?

ఇంకొక ఆసక్తికరమైన మ్యాచ్ కి రంగం సిద్ధమయ్యింది. ఫైనల్స్ లో స్థానం కోసం టీమిండియా ఇంగ్లాండ్ టీమ్ తో తలపడనుంది. ఇంగ్లాండ్ టీమ్ ని మట్టికరిపించి పాకిస్తాన్ తో ఫైనల్స్ లో తలపడాలని ఇండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఇంగ్లాండ్ టీమ్ ని తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. పొట్టి ఫార్మాట్ లో ఇంగ్లాండ్ టీమ్ చాలా మెరుగ్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అసలు రికార్డ్స్ ఏం చెప్తున్నాయి ఇప్పుడు చూద్దాం. టీ20 ప్రపంచకప్‌లో మూడు సార్లు ఇరు జట్లు తలపడ్డాయి. అయితే రెండు సార్లు మెన్ ఇన్ బ్లూ గెలవగా ఒకసారి ఇంగ్లీష్ టీమ్ గెలిచింది. ఇక పొట్టి ఫార్మాట్ విషయానికొస్తే టీమిండియా కి మంచి గణాంకాలు ఉన్నాయి. సగం కంటే ఎక్కువ మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఆడిన 22 మ్యాచ్ లలో 12 సార్లు విజేతగా నిలిచింది ఇండియా ఇందులో ఇంగ్లాండ్ గడ్డ మీద గెలిచిన మ్యాచ్ లలో కూడా ఉన్నాయి. అయితే 10 సార్లు ఇంగ్లాండ్ జట్టు గెలిచింది.

Team India Vs England: టీ20 వరల్డ్ కప్ పోటీలో ఇలా..

2007 టీ20 వరల్డ్ కప్,2009 టీ20 వరల్డ్ కప్,2012 టీ20 వరల్డ్ కప్ లలో ఇరు జట్లు తలపడ్డాయి. 2009 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే మిగిలిన రెండు మ్యాచ్ లలో ఇండియా గెలుపు సొంతం చేసుకుంది. 2007 టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ బ్యాట్ తో వీరవిహారం చేసాడు.