Featured

Nagineedu : ఓట్ల కోసం అడుక్కోవడం ఏంటి?? గెలిపించిన వాళ్ళు విష్ణుని అడగాలి : నాగినీడు

Nagineedu : ప్రసాద్ ల్యాబ్ లో జనరల్ మేనేజర్ గా పని చేసిన నాగినీడు గారు ఆ తరువాత బెల్లం కొండ సురేష్ గారి సలహాతో సినిమాలోకి వచ్చారు. మొదట వి వి వినాయక్ ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాలో మంత్రి పాత్రలో కనిపించిన నాగినీడు గారు ఆ తరువాత రాజమౌళి గారి ‘మర్యాద రామన్న’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు తమిళ భాషలో కూడా మంచి సినిమాలలో నటించిన నాగినీడు గారు క్రితం ‘మా అసోసియేషన్’ ఎన్నికల్లో సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. మా బిల్డింగ్ తదితర హామీల గురించి విష్ణు అధ్యక్షుడు అయ్యాక చేస్తున్న పనుల గురించి తన అభిప్రాయలను తెలిపారు.

ఓట్లు ఎందుకు అడుక్కోవాలి…

ప్రకాష్ రాజ్, విష్ణు పోటా పోటీ గా జరిగిన మా ఎలక్షన్ లో మంచు విష్ణు అతని ప్యానెల్ గెలిచారు. సార్వత్రిక ఎన్నికల తరహాలో హామీలు ప్రచారాలు అంటూ హోరెత్తించారు. ముఖ్యంగా మంచు విష్ణు గెలవడానికి కారణం ఆయన మా అసోసియేషన్ కి బిల్డింగ్ కట్టిస్తానని హామీ ఇవ్వడం. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్నుం డి పోటీ చేసిన నాగినీడు ఆయన ఓడిపోడానికి గల కారణాలను వివరించారు. ఎలక్షన్ మొదలయ్యాక విత్ డ్రా చేసుకోవాలని అనుకున్నా కానీ కొనసాగించాల్సి వచ్చింది.

ప్రకాష్ రాజ్ గారు నటుడుగా బాగా ఇష్టం కానీ వ్యవహారికంగా బేదాభిప్రాయాలు వచ్చాయి. ఎలక్షన్ నుండి తప్పుకుందామని అనుకుంటే కుదరలేదు. పైగా నాకు ఓట్లు అడగడం అనే పద్దతి నచ్చలేదు. మన గురించి ఒక అవగాహన, ఎంత సోషల్ సర్వీస్ చేయగలం అని తెలిస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు నచ్చక పోతే ఓట్లు వేయరు అడగాల్సిన పని లేదు అని నా అభిప్రాయం అంతే, అందుకే ఓట్లు అడగలేదు. ఇక ఓడిపోయినా పెద్ధగా ఏం అనిపించలేదు అంటూ చెప్పారు. విష్ణు హామీల గురించి మాట్లాడుతూ అది గెలిపించుకున్నవాళ్లు ఓట్లు వేసినవాళ్లు అడగాలి నేనెందుకు అడగాలి, హామీలు ఏమయ్యాయి అని ఓట్లు వేసినవాళ్లు సైలెంట్ గా ఉన్నపుడు వేరేవాళ్ళకెందుకు అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

25 minutes ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

20 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

20 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

21 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

21 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

21 hours ago