Featured

Director G. Nageswar reddy : ఆ సినిమా స్టోరీ నాదే… ఆ తప్పు వల్లే సినిమాకు నష్టాలు… మంచు ఫ్యామిలీతో సినిమా చేయాలంటే భయపడతారు : డైరెక్టర్ జి నాగేశ్వరావు

Director G. Nageswar reddy : ఎస్వి కృష్ణ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ‘సిక్స్ టీన్’ సినిమాతో డైరెక్టర్ గా మారిన జీ నాగేశ్వర్ రెడ్డి గారు ఆ తరువాత ఇదేనా మొదటి ప్రేమ లేఖ, గర్ల్ ఫ్రెండ్, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, వంటి సినిమాలను తీశారు. ఇక అల్లరి నరేష్ సీమశాస్త్రి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత మంచు ఫ్యామిలీ కాంపౌండ్ లోకి వెళ్లిన నాగేశ్వరరెడ్డి గారు దేనికైనా రెడీ, కరెంటు తీగ, ఈడో రకం ఆడో రకం, ఆచారి అమెరికా యాత్ర సినిమాలను తీశారు. తాజాగా మరోసారి మంచు విష్ణు తో ‘జిన్నా’ సినిమా తీసిన ఆయన మంచు ఫ్యామిలీ గురించి అలాగే ఆయన సినిమాల గురించి మాట్లాడారు.

మోహన్ బాబు అంటే అందరూ భయపడతారు…

మంచు ఫ్యామిలీతో చాలా ఏళ్ళ నుండి ట్రావెల్ అవుతున్న జీ నాగేశ్వరరెడ్డి గారు మంచు కుటుంబం గురించి మోహన్ బాబు గురించి మాట్లాడారు. మోహన్ బాబు గారు అందరితో చాలా సీరియస్ గా ఉంటారు, తిడతారు అన్నది అపోహ మాత్రమే, ఆయన చాలా సరదాగా ఉంటారు, అందరితో బాగా మాట్లాడుతూ జోక్స్ వేస్తారు. కాకపోతే ఆయన నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్ల అలా కనిపిస్తారు అది చాలా మందికి నచ్చదు అంటూ చెప్పారు. మంచు విష్ణు కూడా వాళ్ళ నాన్న లాగా చాలా సరదాగా ఉంటాడు కానీ ఆయనలా స్ట్రైట్ గా మాట్లాడడు. మోహన్ బాబు గారు ముక్కుసూటిగా మాట్లాడుతారు కాబట్టి బయటకి అవి వేరేలా ఎలా వెళ్తాయో తెలుసు అందుకే విష్ణు అలా మాట్లాడడు కొంచెం లౌక్యంగా వ్యవహారిస్తాడు.

కానీ అందరితో మంచు కుటుంబం చాలా బాగా ఉంటారు అంటూ చెప్పారు. ఇక మనోజ్ హై వాల్టేజ్ ఎనర్జీ అలా ఉంటాడు అంటూ చెప్పారు. జిన్నా సినిమా సమయంలో నిర్మాతగా మోహన్ బాబు అన్ని చూసుకున్నారు కానీ డైరెక్టర్ కి వాల్యూ ఇస్తారు, జిన్నా స్టోరీ నాదే అంటూ జిన్నా సినిమా గురించి చెప్పారు. ఇక తన కెరీర్ లో బాగా నష్టపోయిన సినిమా అంటే సీమ శాస్త్రి సినిమా వల్ల అంటూ చెప్పారు. ఆ సినిమా బడ్జెట్ నరేష్ కి అప్పటి వరకు 70 లక్షల నుండి కోటి వరకు ఉంటే సీమ శాస్త్రి కి కోటి డెబ్భై లక్షల వరకు వెళ్లడం, అందులో చాలా మటుకు నేను పూచికత్తు పెట్టడం వల్ల సినిమా హిట్ అయి మంచి లాభాలు వచ్చినా నా చేతికి రాలేదు దాంతో ఇబ్బందులు పడ్డాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

11 hours ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

11 hours ago

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే వేల రూపాయల తగ్గుదల.. తాజా ధరలు ఇవే!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…

11 hours ago

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

1 day ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

1 day ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

1 day ago