Featured

Director Geetha Krishna : ఆడియో లీక్ డ్రామా నడిపించింది వాళ్ళే… రజనీకాంత్ కంటే గొప్పోడా… పూరీ లైగర్ డిస్ట్రిబ్యూషన్ వివాదం : డైరెక్టర్ గీతా కృష్ణ

Director Geetha Krishna : పూరీ జగన్నాథ్ డైరెక్టర్, పూరీ ఛార్మి ఇద్దరూ నిర్మాతలుగా తీసిన పాన్ ఇండియా చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా విజయ్ మార్కెట్ ను దాటి బడ్జెట్ పెట్టడం వల్ల ఫ్లాప్ అయింది. పెట్టిన బడ్జెట్ లో కొంచెం కూడా రాకపోవడం వల్ల సినిమా డిస్ట్రిబ్యూటర్లు బాగా నష్టపోయారు. ఈ విషయంలో మాకు న్యాయం చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లు పూరీ జగన్నాథ్ ను అడగడం వారితో మాట్లాడిన మాటలు ఆడియో లీక్ అవడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే అసలు పూరీ ఆడియోస్ లీక్ ఎలా అయ్యాయి, డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు చెల్లించాల్సిందేనా అన్న విషయాల మీద డైరెక్టర్ గీతా కృష్ణ మాట్లాడారు.

ఆడియో వాళ్ళే లీక్ చేయించారు…

పూరీ జగన్నాథ్, ఛార్మి నిర్మాతలుగా కరణ్ జోహార్ ను భాగస్వామిగా తీసుకుని నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగినా ఆ తరువాత సినిమా ఫ్లాప్ అవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిక్యూటర్లకు బాగా నష్టం వచ్చింది. నష్టం చెల్లించాలంటూ అడగడం, పూరీ నేను ఎవరికి ఇవ్వాల్సి ఉందో వారికి చెల్లిస్తాను అంటూ చెప్పడం వల్ల ఇష్యూ సీరియస్ గా మారి ధర్నా చేస్తాం అంటూ డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు. అయితే ఈ విషయం గురించి సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ మాట్లాడుతూ ఆ ఆడియో లీక్ పూరికి సంబంధించిన వాళ్ళే కావాలని చేయించారు. జనాలకు తెలియాలని ఇష్యూ గురించి అంతే, అయినా పూరీ చెప్పినట్లు అతను నష్టం భరించాల్సిన పని లేదు. అగ్రిమెంట్ చేసుకుని ఉంటే రిటర్నబుల్ అమౌంట్ ఇచ్చేస్తామని అప్పుడు వీళ్ళు అడిగే హక్కు ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లందరికి డబ్బు వెనక్కి ఇచ్చేంత ఇప్పటి వరకూ ఎవరూ చేయలేదు, రజనీకాంత్ కూడా అందరికీ న్యాయం చేయలేదు అంతకంటే గొప్పవాడా పూరీ అంటూ గీతా కృష్ణ అభిప్రాయ పడ్డారు. కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్ల విషయంలో న్యాయం చేసాడని అన్నా దానివల్ల అతని ఇమేజ్ మారదు కొరటాల లాస్ట్ ఫిల్మ్ ఫ్లాప్ అనే అంటారు.

పాపం మీరు నష్టపోయారు అని జాలి చూపించాల్సి వస్తే అందరి మీదా చూపించాలి, అందరికీ ఇవ్వాలి అలా ఇవ్వలేరు కాబట్టి పూరీ నేను అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన వారికి ఇస్తాను అంతే ఇంకెవరికీ చెల్లించాల్సిన పనిలేదని చెప్పాడు. ఇక పూరీ ఛార్మి సినిమా వల్ల నష్టపోలేదంటూ గీతా కృష్ణ ఆసక్తికర వాఖ్యలు చేసారు. వాళ్లిద్దరూ సినిమా బడ్జెట్ ఎస్టిమేషన్ అపుడే డబ్బు కొంత పక్కన పెట్టుకొని ఉంటారు, ఇక బిజినెస్ ప్రీ రిలీజ్ అప్పుడు బాగా జరిగింది కాబట్టి వాళ్లకు సినిమా వల్ల లాభమే వచ్చింది. నష్టపోయింది కేవలం సినిమాను కొన్న వాళ్ళు వారికి డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత నిర్మాత మీద లేదు కదా అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

దేవుడికి నమస్కారం చేస్తే ఎందుకు కళ్లు మూసుకుంటాం? అసలు కారణం ఇదే!

దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…

17 minutes ago

తెలంగాణలో ఎవరి జనాభా ఎక్కువ?.. కుటుంబ సర్వేలో బిగ్ రివీల్

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…

38 minutes ago

అమావాస్య వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుంటే ఆశ్చర్యమే!

ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…

47 minutes ago

అంతర్జాతీయ విజయాల కోసం తిరుమల చేరుకున్న పీవీ సింధు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…

1 hour ago

ఎవరీ నటాలీ బేకర్?.. అమెరికా-ఇరాన్ చర్చలతో ట్రెండ్‌లోకి

ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…

1 hour ago

సచిన్‌తో హీరోయిన్ ప్రేమాయణం?.. అసలు నిజం బయటపెట్టిన నటి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…

2 hours ago