Team India: టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. సూపర్ 12 లో టేబుల్ టాపర్ గా నిలిచిన రోహిత్ సేన ఇంకో రెండు అడుగులు వేయగలిగితే చాలు టీ20 ట్రోఫీ ని ముద్దాడే క్షణం ఆసన్నమవుతుంది. ఇందులో మొదటి సవాలుని స్వీకరించబోతోంది టీమిండియా. సెమీస్ లో ఇంగ్లీష్ టీం తో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఇంక ఫైనల్ కే. ఫైనల్స్ లో దాయాది పాకిస్తాన్ తో తలపడవచ్చు.
ఇద్దరు వికెట్ కీపర్లలో ఎవరిని ఎంపిక చేయాలి?
ఇంగ్లాండ్ తో మ్యాచ్ కి ముందు టీమిండియా కి ఒక పెద్ద సవాలు ఎదురయింది. ప్రస్తుతం టీమ్ లో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఒకరు దినేష్ కార్తీక్ ఇంకొకరు రిషబ్ పంత్ ఇద్దరిలో తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలి అనే దాని మీద ఎవరి వద్దా క్లారిటీ లేదని నిపుణులు చెప్తున్నారు.
దినేష్ కార్తీక్ ఫినిషర్ గా టీమ్ లోకి వచ్చాడు. అయితే ఇప్పటి వరకూ ఈ పాత్ర పోషించలేకపోయాడు. ఐదు మ్యాచ్ లలో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అతని స్థానంలో పంత్ కి అవకాశం ఇవ్వాలనే వాదన గట్టిగా వినబడుతోంది. కొంత మంది దిగ్గజ ఆటగాళ్ళు కూడా ఈ వాదనకి ఆజ్యం పోస్తున్నారు.
రిషబ్ పంత్ విషయానికొస్తే ఈ కుర్ర బ్యాట్సమెన్ దూకుడుగా అడగలడు. దీనికి తోడు పంత్ కి ఆస్ట్రేలియా గడ్డ మీద మంచి రికార్డ్ ఉంది. ఈ రికార్డ్ ఆధారంగా పంత్ కి అవకాశం ఇవ్వాలని కొందరు అంటున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరిని ఆడించాలి అనే దాని మీద మల్లగుల్లాలు పడుతున్నారట టీమ్ మేనేజ్‌మెంట్,హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్,సారధి రోహిత్ శర్మ. చూడాలి మరి ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారో. ఒకవేళ ఇద్దరినీ తీసుకుంటే ఇంకొక అతగాడిని దూరం పెట్టాల్సి వస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…