మహిళలకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఆ వాహనాల పంపిణీ..?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కొత్త పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. కేసీఆర్ సర్కార్ మహిళల ఆర్థిక స్వావలంబన కొరకు ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళల కొరకు కేంద్రం కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది.

ఈ పథకం ద్వారా తెలంగాణ సర్కార్ మహిళలకు చేపలు, చేపల వంటల విక్రయానికి మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను పంపిణీ చేయనుంది. ఇప్పటికే గ్రామాలలో నివశిస్తున్న మత్స్యకారులకు టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలను సబ్సిడీ కింద అందిస్తున్న తెలంగాణ సర్కార్ మరో కొత్త స్కీమ్ అమలు దిశగా అడుగులు వేయడం గమనార్హం. ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోలోని ఒక్కో డివిజన్ కు ఒకటి చొప్పున 150 డివిజన్లకు 150 సంచార చేపల విక్రయ వాహనాలను అందిస్తోంది.

సంచార చేపల విక్రయ వాహనం ఖరీదు 10 లక్షల రూపాయలు కాగా ఏకంగా 60 శాతం సబ్సిడీతో మహిళలు ఈ వాహనాలను పొందే అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కొరకు దేశంలో ఎక్కడా లేని విధంగా చర్యలు చేపట్టడం గమనార్హం. మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ స్కీమ్ ద్వారా తాజా చేపలు, చేపల వంటకాలను వినియోగదారుల దగ్గరకు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ స్కీమ్ అమలు ద్వారా కష్టపడి పని చేసే మహిళలకు ప్రయోజనం చేకూర్చే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుండటం గమనార్హం. ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడాలని.. మహిళలు లబ్ధి పొందాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.