తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కొత్త పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. కేసీఆర్ సర్కార్ మహిళల ఆర్థిక స్వావలంబన కొరకు ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళల కొరకు కేంద్రం కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది.
ఈ పథకం ద్వారా తెలంగాణ సర్కార్ మహిళలకు చేపలు, చేపల వంటల విక్రయానికి మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను పంపిణీ చేయనుంది. ఇప్పటికే గ్రామాలలో నివశిస్తున్న మత్స్యకారులకు టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను సబ్సిడీ కింద అందిస్తున్న తెలంగాణ సర్కార్ మరో కొత్త స్కీమ్ అమలు దిశగా అడుగులు వేయడం గమనార్హం. ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోలోని ఒక్కో డివిజన్ కు ఒకటి చొప్పున 150 డివిజన్లకు 150 సంచార చేపల విక్రయ వాహనాలను అందిస్తోంది.
సంచార చేపల విక్రయ వాహనం ఖరీదు 10 లక్షల రూపాయలు కాగా ఏకంగా 60 శాతం సబ్సిడీతో మహిళలు ఈ వాహనాలను పొందే అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కొరకు దేశంలో ఎక్కడా లేని విధంగా చర్యలు చేపట్టడం గమనార్హం. మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ స్కీమ్ ద్వారా తాజా చేపలు, చేపల వంటకాలను వినియోగదారుల దగ్గరకు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ స్కీమ్ అమలు ద్వారా కష్టపడి పని చేసే మహిళలకు ప్రయోజనం చేకూర్చే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుండటం గమనార్హం. ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడాలని.. మహిళలు లబ్ధి పొందాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…