ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని పేదవారికి మరో శుభవార్త చెప్పారు. కొత్తగా ఇంటి స్థలం కొరకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అర్హుడని తేలితే 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టాను అందించాలని సూచించారు. రాష్ట్రంలో 26,21,049 ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 30,06,673 ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోందని సీఎం తెలిపారు. ఎవరైనా ఇంటి పట్టా కొరకు దరఖాస్తు చేసుకుంటే వారిని దరఖాస్తు అందిన 12 రోజుల్లో భౌతికంగా వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వెరిఫికేషన్ చేయాలని జగన్ పేర్కొన్నారు.
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 90.28 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ ఇప్పటికే పూర్తైందని జగన్ తెలిపారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంపై సమీక్ష నిర్వహించిన జగన్ సమీక్షలో భాగంగా ఈ విషయాలను వెల్లడించారు. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ నిరంతర కార్యక్రమం అని సీఎం జగన్ పేర్కొన్నారు. అధికారులు ఇళ్ల స్థలం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జగన్ సూచించారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందాలనే ఉద్దేశంతో జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. స్థలం ఉండి ఇల్లు లేని వారికి కూడా ప్రయోజనం చేకూర్చే దిశగా జగన్ సర్కార్ ముందడుగులు వేయనుంది. సీఎం జగన్ లబ్దిదారులను సోషల్ అడిట్ ద్వారా గుర్తించాలని.. నిర్మాణాల్లో నాణత, ఏకరూపత కోసం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచనలు చేశారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు.
డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలని.. త్వరగా ఈ ప్రక్రియను మొదలుపెట్టాలని పేర్కొన్నారు. అధికారులు మార్చి నెల 31 నాటికి జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డీపీఆర్ ను సిద్ధం చేస్తామని సీఎం జగన్ కు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…