General News

నిరుద్యోగులకు మరో శుభవార్త.. 10,811 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

కరోనా ఉధృతి తగ్గడం వల్ల గత రెండు నెలల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో నోటిఫికేషన్ విడుదలైంది. కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా నుంచి ఏకంగా 10,811 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా మినిస్టీరియల్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్‌, జ‌న‌ర‌ల్ సెంట్ర‌ల్ స‌ర్వీసెస్ విభాగాలలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.


స్థానిక భాషలో ప్రొఫిషియ‌న్సీ ఉండటంతో పాటు డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 19వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. 10,811 ఉద్యోగాలలో ఆడిట‌ర్ ఉద్యోగ ఖాళీలు 6,409 ఉండగా అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలు 4,402 ఉన్నాయి. తెలంగాణ ఉద్యోగ ఖాళీలు 220, ఆంధ్రప్రదేశ్ లో 144 ఖాళీలు ఉన్నాయి.

అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలలో తెలంగాణలో 132 ఖాళీలు ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 120 ఖాళీలు ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://cag.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. shri v s venkatanathan, asstt. c &ag>(n), o/o the c&ag>of india, 9, ddu marg, new delhi అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకొని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 29,200 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిద్రలేవగానే బెడ్ సర్దేస్తున్నారా? ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?

ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…

2 minutes ago

రుణబాధలు తగ్గాలా? వైశాఖ అమావాస్య రోజు తప్పక చేయాల్సినవి!

2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…

56 minutes ago

‘బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం’.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…

2 hours ago

పాస్ చేయండి సార్ అంటూ బోర్డుకు కాల్.. విశాఖలో విద్యార్థి వింత ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…

2 hours ago

కూతురి ప్రాణం తీశిన తండ్రి.. భువనగిరిలో దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…

3 hours ago

గురువారం పూజతో అదృష్టం మారుతుందా? కాశీలో అరుదైన బృహస్పతి ఆలయం.. గురు దోషాలకు ప్రత్యేక పరిష్కారం!

భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…

3 hours ago