అరటి ‘తొక్కే’ కదా అని చెత్తబుట్టలో వేయకండి.. దాని ఉపయోగాలు తెలుసుకోండి..

అరటిపండు ఉపయోగాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అరటిపండు మానవ శరీరానికి చేసే మేలు ఇంకే పండు చేయలేదు. కేవలం అరటిపండు మాత్రమే కాదు దాని తొక్క వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఓ సినిమాలో మెగస్టార్ చిరంజీవి డైలాగ్ చెబుతారు..

అందేంటంటే.. ‘వీర శంకర్ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా..’ అని.. అలాగే ఇక్కడ కూడా తొక్కే కదా అని బయట పడేస్తే.. నష్టపోవడం తప్పదు. అవును.. మీరు విన్నది నిజమే.. అరటి తొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవేంటంటే.. అరటి తొక్కతో ప్రతి రోజూ ఒక నిమిషం పాటు పళ్లను రుద్దుకుంటూ ఇలా వారం రోజుల పాటు ఇలా చేస్తే పళ్లు మిలమిలా మెరుస్తాయి.

ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉంటే.. ఆ ప్రదేశంలో తొక్కను పేస్ట్ గా చేసి మర్దన చేయాలి. వారం పాటు ఇలా చేశారంటే మొటిమల సమస్య తగ్గుతుంది. అరటి తొక్క పులిపిర్లను(పులిపెర) తొలగించడంలో సహాయపడుతుంది మరియు కొత్తవి రాకుండా చేస్తుంది. దీనికోసం, పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దండి లేదా ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను కట్టండి. తర్వాత కొంత కాలానికి మనకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఊడిపోతాయట.

సోరియాసిస్ తో ఉన్న ప్రాంతం అంతటా అరటితొక్కతో రాయండి. అరటి తొక్క మాయిశ్చరైజేషన్ గుణాలను కలిగి ఉన్నది మరియు దురదను కూడా తగ్గిస్తుంది. ఇది త్వరగా సోరియాసిస్ ను నయం చేస్తుంది . దురద మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు దోమలకాటు ఉన్న చర్మము మీద అరటితొక్కతో మసాజ్ చేయండి. ఎంతో ఉపశమనం పొందుతారు. ఇంకా అరటి తొక్కలను షూ పాలిష్‌గా కూడా వాడవచ్చు. అరటి తొక్క హానికరమైన యూవీ కిరణాలు నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతుంటారు.