Movie News

విడాకులపై స్పందించిన నాగచైతన్య.. ఏమన్నారంటే..?

నాగచైతన్య, సమంత మధ్య గత కొన్ని రోజుల నుంచి విడాకులకు సంబంధించి వార్తలు వైరల్ గా మారాయి. ప్రతీ రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉండేది. వారి కాపురంలో ఏర్పడ్డ విభేదాలు తారాస్థాయికి చేరాయని.. అందుకనే ఎన్ని వార్తలు వచ్చిన పట్టించుకోవడం లేదంటూ కూడా సోషల్ మీడియాలో రూమర్లు వైరల్ అయ్యాయి.

అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు నాగచైతన్య స్పందించారు. రేపు అనగా సెప్టెంబర్ 24 న ‘లవ్ స్టోరీ’ విడుదల సందర్భంగా అతడు ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో అతడు మీడియాతో మాట్లాడారు. తన పేరుపై వస్తున్న పుకార్లు చూసి మొదట్లో చాలా బాధపడ్డానని.. ఒకరిని ఇబ్బందులకు గురి చేసి ఇలాంటి వార్తలు ఎలా రాస్తారనే ఆవేదనకు గురయ్యానని పేర్కొన్నాడు.

మొదట్లో మాస పత్రికల్లో సినిమాల గురించి ఎక్కువగా వచ్చేవని.. అప్పుడు అందులో వచ్చింది నెల రోజులు ఉండేదని.. దానినే ఎక్కువగా నమ్మేవారని చెప్పాడు. కానీ ప్రస్తుతం అలా లేదని.. ఒక వార్త ప్రచురితమైన వెంటనే దాని గురించి మళ్లీ క్షణ్ణంగా తెలుసుకొని మళ్లీ.. వేరే దానిని రాసేస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో ప్రజలు ఏ వార్త నమ్మాలో అర్థం గాక ఇబ్బందులకు గురవుతున్నారని.. అయినా ప్రజలు కేవలం నిజం మాత్రం నమ్ముతారనే విషయం అర్థం అయిందంటూ చెప్పుకొచ్చాడు. ఇలా పిచ్చి పిచ్చి రాతలకు స్పందించడం ఎప్పుడో మర్చిపోయానని చెప్పాడు.

ఇక్కడ బాధాకరం ఏంటంటే.. గాసిప్స్ కోసం తన పేరును వాడుకోవడం కరెక్ట్ గా లేదని.. ఇది చాలా బాధను కలిగిస్తుందన్నారు. ఏ వ్యక్తికైనా వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితం అనేవి రెండు ఉంటాయని.. ఆ రెండింటిని విడివిడిగా చూడటం తన తల్లిదండ్రులను చూసి నేర్చుకున్నట్లు తెలిపాడు. వృత్తిపరమైన పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులు ఏనాడు వాటి గురించి మాట్లాడుకోలేదని.. తాను కూడా వాళ్ల నుంచి అదే నేర్చుకున్నట్లు స్పష్టం చేశాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

3 days ago