అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై హీరో, హీరోయిన్లే కాకుండా సిని పరిశ్రమలో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి వసూళ్లను సాధిస్తే.. మిగతా సినిమాలను కూడా విడుదల చేసేందుకు క్యూ కడతాయి.
అందుకే ప్రతీ ఒక్కరూ ఈ సినిమా విడుదలపై తర్వాత అది సాధించే కలెక్షన్లపై నమ్మకం పెట్టుకున్నారు. ప్రతీ ఒక్కరు ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడానికి కారణం కూడా అదే. అయితే శేఖర్ కమ్ముల దీనికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అతడి దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా ప్రేక్షకుల ఒక విభిన్నమైన అనుభూతిని ఇస్తుంది.
దీనిలో కూడా ఏదో అద్భుతం చేసే ఉంటాడని ప్రతీ ఒక్కరు ఆశలు పెట్టుకున్నారు. సాయి పల్లవి ఫిదా సినిమాలో అతడి డైరెక్షన్లో చేసిన విషయం తెలిసిందే. అందులో తెలంగాణ యాస సాయి పల్లవి దించేసింది. దీనిలో కూడా తెలంగాణ పరిసరాల నేపథ్యంలో సినిమా ఉండనుందని సినీ వర్గాల టాక్. ఇదిలా ఉండగా.. ఇందులో నాగచైతన్య తల్లిగా సీనియర్ నటి ఈశ్వరీ రావు నటించారు. ఇందులో పేద మహిళగా ఆ క్యారెక్టర్ ఉంటుంది.
అయితే ఆడిషన్స్ కు ఆమెనకు ఫోన్ చేసి రమ్మన్నడప్పుడు ఆమె రూ.80 చీర కట్టుకొని వచ్చిందని.. ఆమెను చూసి తాను ఆశ్చర్యపోయానని శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలాంటి నటిని తాను ఎన్నడూ చూడలేదని.. ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉండగా.. ఆమె అరవింద సమేత, అల వైకుంఠపురం, కాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…