వీడియో వైరల్: ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి దుప్పట్లో దూరిన పాము.. చివరికి ఏం జరిగిందంటే?

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అటవీ ప్రాంతాలలో ఉండాల్సిన పాములు జనావాసాలలో తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు ఏదో ఒకచోట పాములు బీభత్సం సృష్టించడం గురించి వింటున్నాం. తాజాగా ఓ వ్యక్తి ఆరుబయట ఆవరణంలో నిద్రిస్తుండగా పాము ఏకంగా అతని దుప్పటిలోకి దూరిన ఘటన రాజస్థాన్ బాన్స్‌వాడ జిల్లాలో ఓ దేవాలయ ప్రాంగణంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆలయ ఆవరణంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆలయ ప్రాంగణంలో ఓ వ్యక్తి నేలపై నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలోనే అటుగా తాచు పాము వెళ్తూ నిద్రిస్తున్న వ్యక్తి దుప్పట్లో దూరింది.అయితే అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న ఆవ్యక్తి తన ఒంటిపై ఏదో పాకుతున్నట్టు అనిపించడంతో నిద్రలేచి చూశాడు. అయితే తన శరీరంపై తాచుపాము చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు.

ఈ క్రమంలోనే వెంటనే దుప్పటి పక్కకు విసిరి అక్కడి నుంచి భయంతో పరుగు పెట్టాడు. ఆ పాము కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది. అయితే ఆ పాము అతని దుప్పట్లో దూరినప్పటికే అతనికి ఏమీ చేయక పోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. అతని అదృష్టం బాగుందని, అతనికి ఇంకా భూమిపై నూకలు ఉన్నాయంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.