PUBG: పబ్ జీ కి బానిసై కుటుంబ సభ్యులను కాల్చిచంపిన బాలుడు..!

PUBG: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మొబైల్ ఆన్లైన్ గేమ్స్ కి బాగా అలవాటు పడ్డారు అని చెప్పవచ్చు. ఇలా మొబైల్ ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఎంతోమందిని ఆకర్షించిన వాటిలో పబ్ జీ ఒకటి. చాలామంది ఈ పాటకు బానిసగా మారి పూర్తిగా అదే ధ్యాసలో ఉండిపోయి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

తాజాగా ఈ ఆటకు బానిసైన ఓ కుర్రాడు ఏకంగా తన కుటుంబాన్ని మొత్తం కాల్చి చంపిన ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. లాహోర్‌లోని కహ్నా ప్రాంతానికి చెందిన 45ఏళ్ల నహిద్‌ ముబారక్‌ హెల్త్‌ వర్కర్ గా పనిచేస్తూ తన భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి ఉంటుంది. ఈమెకు మొత్తం నలుగురు పిల్లలు కాగా వీరిలో చిన్న కుమారుడు పూర్తిగా పబ్ జీ కి బానిస అయ్యారు.

నిత్యం సెల్ ఫోన్ లో ఈ ఆటకు అంకితం కావడం వల్ల తన తల్లి సోదరుడు తనని హెచ్చరించారు.ఇలా తన తల్లి తనని హెచ్చరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ బాలుడు కబోర్డ్ లో ఉన్నటువంటి తుపాకి తీసుకుని తన తల్లి అలాగే సోదరుడు ఇద్దరు సోదరిలను తుపాకితో కాల్చిచంపాడు.అనంతరం ఆ తుపాకీని కాలువలో పడేసి తన కుటుంబాన్ని కాల్చి చంపారని ఇరుగుపొరుగు వారికి తెలియజేశారు.

బయట పడిన అసలు నిజం…

ఇక ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని విచారించారు. ఈ ఘటన జరిగిన సమయంలో తాను ఇంట్లో లేనని మేడపైన ఉన్నానని పోలీసులకు సమాధానం చెప్పారు. బాలుడి ప్రవర్తనలో అనుమానం రావడంతో పోలీసులు అతనిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.దీంతో తన కుటుంబం మొత్తాన్ని తానే కాల్చి చంపానని అనంతరం ఆ తుపాకీ మురికి కాలవలో పడేసినట్లు పోలీసులకి తెలిపారు.అయితే ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు పూర్తిగా ఆటకు బానిస కావడం వల్ల తన మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు వెల్లడించారు.