Singer Sunitha Husband: టాలీవుడ్ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సునీత తన రెండవ వివాహాన్ని మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. డిజిటల్ మీడియాలోఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ గత కొద్దిరోజుల నుంచి ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే రామ్ వీరపనేని యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని సినిమాల డిజిటల్ హక్కులను కొనుగోలు చేసి యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన ఒక సినిమా విషయంలో ఈయనకు తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
ఆ సినిమాలో గౌడ కులానికి సంబంధించిన మహిళలను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆ సన్నివేశాలపై గౌడ కులస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మ్యాంగో మీడియా ఆఫీస్ ఎదుట దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే. అప్పట్లో ఈ వివాదం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా సన్నివేశాల గురించి జరిగిన పరిణామంపై మ్యాంగో మీడియా స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు…ఈనెల 24వ తేదీ గౌడ కులానికి చెందిన కొందరు తమ ఆఫీసు వద్దకు వచ్చి ఒక సినిమా సన్నివేశంపై తమ కులస్థులను కించపరిచేలా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ సన్నివేశాలను తొలగించాలని కోరడంతో వెంటనే ఆ సన్నివేశాలను తొలగించామని… వాటివల్ల ఎవరికైనా వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే బహిరంగంగా క్షమాపణలు తెలియజేస్తున్నామంటూ మీడియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…